వరంగల్‌ జిల్లాలో విషాదం | Three children died after Swimming in Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌ జిల్లాలో విషాదం

Published Wed, Sep 27 2017 1:59 PM | Last Updated on Wed, Sep 27 2017 3:21 PM

Three children died after Swimming in Warangal

చెన్నారావుపేట: వరంగల్‌ రూరల్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని చెరువులో దుస్తులు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు బాలురు కాగా ఓ బాలిక ఉంది. జిల్లాలోని చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన గుంజేల అజయ్‌(10), సాయి(9), అఖిల(9) అనే ముగ్గురు చిన్నారులు ఉర చెరువులో దుస్తులు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు.

ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో చనిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement