దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈసారి కరోనా నేపథ్యంలో నిబంధనలను అనుసరించి పండుగ జరుపుకుంటున్నారు. సినీ స్టార్స్ సైతం కుటుంబసభ్యులు, స్నేహితులతో హోలీ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ , భర్త గౌతమ్ కిచ్లుతో హోలీని సెలబ్రేట్ చేసుకుంది. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి హోలీ కావడంతో భర్తతో కలర్‌ఫుల్ వేడుకలు చేసుకుంది. ఈ సందర్భంగా ఫొటోలు షేర్ చేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో హోలీ ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసింది. స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి హోలీ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు.
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోలీ సందర్భంగా త్రోబ్యాక్ ఫోటోను షేర్ చేశారు. భార్య జయా బచ్చన్, కొడుకు అభిషేక్ బచ్చన్‌తో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రంగ్ బర్‌సే.. అంటూ హిందీ పాటను జతచేస్తూ ఓ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతోంది. హిందీ బిగ్‌బాస్-14 విజేత రాహుల్ వైద్య తన ప్రేయసి, కాబోయే భార్య దిశా పార్మర్‌తో కలిసి హోలీ జరుపుకున్నాడు.
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్, అతని తల్లిదండ్రులతో కలిసి లండన్‌లో గ్రాండ్‌గా హోలీని సెలబ్రేట్ చేసుకుంది. నటుడు సంజయ్‌దత్ కుటుంబంతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. రిషి కపూర్- నీతూ కపూర్‌ల కుమార్తె రిద్ధిమా..సోదరుడు రణ్‌బీర్ కపూర్, తల్లి నీతూతో కలిసి హోలీ పండుగను జరుపుకుంటున్న చిన్ననాటి ఫోటో షేర్ చేసింది. వీరితో పాటు అక్షయ్ కపూర్, షారుక్ ఖాన్, మాధురీ దీక్షిత్, కంగానా పలువురు సెలబ్రిటీలు అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment