రంగుల్లో అల్లువారి బాబు.. మంచు బేబి | Manchu 'babe' and Allu 'boy' celebrate Holi | Sakshi
Sakshi News home page

రంగుల్లో అల్లువారి బాబు.. మంచు బేబి

Published Fri, Mar 6 2015 1:35 PM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM

రంగుల్లో అల్లువారి బాబు.. మంచు బేబి

రంగుల్లో అల్లువారి బాబు.. మంచు బేబి

సినీ ప్రముఖులు అల్లువారి కుటుంబంలో.. ఇటు మంచువారింట్లో ఈసారి హోలీ వేడుకలు మరింత రంగులమయమయ్యాయి. వారిళ్లలో ఇప్పుడిప్పుడే బుల్లిబుల్లిగా అడుగులేసేందుకు ప్రయత్నిస్తున్న చిన్నారులు హోలీ సంబరాల్లో మునిగిపోయారు. మంచులక్ష్మి ముద్దుల కుట్టి విద్యా నిర్వాణ, అల్లు అర్జున్ గారాల పుత్రుడు ఆయాన్ రకరకాల రంగుల్లో మెరిసిపోయారు. తమకు రంగులు పూస్తున్న తల్లిదండ్రులను చూస్తూ పాలబుగ్గల బోసినవ్వులతో కేరింతలు కొట్టారు.

 

ఇక వీరి సంబురాలను చూసి మురిసిపోయిన మంచు లక్ష్మి, అల్లు అర్జున్ చేతిలో కెమెరాలతో వారి ప్రతి కదలికను ఫొటో తీస్తూ ముచ్చటపడ్డారు. మరింత కలర్ఫుల్గా ఉండాలని అల్లు అర్జున్ తన కుమారుడి ముందు ఏడు రంగుల్ని వరుసగా పోసి వాటి మధ్య తన అయాన్ను ఉంచి బోసిగా నవ్వుతూ చప్పట్లు కొడుతుండగా తన కెమెరాలో క్లిక్మనిపించాడు. ఆ వెంటనే, ఇదిగో నా అల్లరి ఆయాన్ రంగుల్లో ఉన్నాడు చూడండంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసి అభిమానులతో సంతోషం పంచుకున్నాడు. మంచు లక్ష్మి కూడా చిన్న గౌను వేసుకున్న తన కూతురు విద్యాను రంగుల్లో ముంచి ఫొటో తీసి ట్విట్టర్లో అభిమానులతో ఆనందం పంచుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement