
టీమిండియా మాజీ ఆటగాడు.. ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్ ఆడేందుకు చెన్నై చేరుకున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ ఆరంభించిన ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరుగుతోంది. జట్టులోకి కొత్తగా వచ్చిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు ధోని కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ విషయం పక్కనబెడితే హోలీ పండుగ పురస్కరించుకొని సీఎస్‌కే ఆటగాళ్లు వేడుకల్లో మునిగితేలారు. ఈ సందర్భంగా ఆటగాళ్లంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోగా.. ధోనిపై మాత్రం ఒక్క రంగు మరక కూడా కనిపించలేదు. ధోని ఇక్కడ కూడా తన మాస్టర్ మైండ్ ఉపయోగించి రంగుల బారీ నుంచి ఎలా తప్పించుకున్నాడనేది దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్‌కే తన ట్విటర్‌లో షేర్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.
ఇక మార్చి 31న ఐపీఎల్ 16వ సీజన్‌కు తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో సీఎస్‌కేతో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఇక గతేడాది ఐపీఎల్‌లో సీఎస్‌కే అంతగా ఆకట్టుకోలేకపోయింది. 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి పదింటిలో ఓడి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
Celebrating Holi the "Thala" Way 😁
— Chennai Super Kings (@ChennaiIPL) March 8, 2023
Anbuden Diaries Full 🎥👉 https://t.co/8NqSJ8t4QJ#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/vKI5F3T8G7