
సినిమా షూటింగ్‌లతో నిరంతరం బిజీగా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడనే విషయం తెలిసిందే. షూటింగ్ ప్రదేశాలకు కూడా తారక్ అప్పుడప్పుడు పిల్లలను తీసుకొస్తుంటాడు. తాజాగా తన కుటుంబంతో కలిసి హోలీ జరుపుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అంటూ భార్య ప్రణతి, ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి ముఖానికి రంగులు చల్లుకున్న ఫోటోతో ట్వీట్ చేశాడు. (ఆర్‌ఆర్‌ఆర్ టైటిల్ ఇదే..)
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతుండంతో ఈ ఫోటోను చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అలాగే ఎన్టీఆర్‌కు హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా దీనిపై టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు. ఎన్టీఆర్ చిన్న కొడుకును ఉద్ధేశించి ‘చిన్నవాడు కెమెరా వైపు చూస్తున్న విధానం ఏదో చెబుతుంది.. వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు. లిటిల్ టైగర్.. వస్తున్నాడు’. అంటూ రీట్వీట్ చేశాడు. (ఆర్‌ఆర్‌ఆర్‌తో కేజీఎఫ్ 2 ఢీ : యష్ వివరణ)
ఇక తారక్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్, అలియాభట్, ఒలియా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చిత్రీకరణ అయిపోయిన వెంటనే తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తారక్‌కు ఇది 30వ సినిమా కావడం విశేషం. (యంగ్ టైగర్ అభిమానులకు గుడ్ న్యూస్!)
The way younger one is looking at camera says something …… odilithe ippude dookeselaa unnadu…………… 👌👌👌 https://t.co/k6TDsPbd5X
— Harish Shankar .S (@harish2you) March 10, 2020
Little Tigerrrrrrr❤️❤️❤️❤️❤️ on the wayyy!!!!!
— Harish Shankar .S (@harish2you) March 10, 2020
Comments
Please login to add a commentAdd a comment