రన్నింగ్‌ బస్‌లో హోలీ వేడుకలు; డ్యాన్స్‌తో దుమ్మురేపిన క్రికెటర్లు | Virat Kohli-Rohit Sharma-Others Celebrate Holi Team Bus Video Viral | Sakshi
Sakshi News home page

Team India: రన్నింగ్‌ బస్‌లో హోలీ వేడుకలు; డ్యాన్స్‌తో దుమ్మురేపిన క్రికెటర్లు

Published Tue, Mar 7 2023 8:56 PM | Last Updated on Tue, Mar 7 2023 9:21 PM

Virat Kohli-Rohit Sharma-Others Celebrate Holi Team Bus Video Viral - Sakshi

టీమిండియా క్రికెటర్లు రన్నింగ్‌ బస్‌లో హోలీ పండుగ వేడుకలు జరుపుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రంగులు పూసుకోవడంతో పాటు కోహ్లి సహా ఇతర క్రికెటర్లు బేబీ కామ్‌డౌన్‌(Baby Calm Down) పాటకు చిందులేశారు. వేడుకల్లో కోహ్లి, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ, శ్రేయాస్‌ అయ్యర్‌లు హైలైట్‌ అయ్యారు. మిగతా క్రికెటర్లు కూడా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

కోహ్లి డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో వెనుక నుంచి రోహిత్‌ గులాల్‌ను చల్లడం ఆసక్తి కలిగించింది. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో హోలీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేశాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న నాలుగో టెస్టు జరగనున్న సంగతి తెలిసిందే. స్టేడియంలో ప్రాక్టీస్‌ చేయడానికి హోటల్‌ రూం నుంచి బస్సులో బయలుదేరిన సందర్భంలో ఈ వేడుకలు నిర్వహించారు.

ఇక అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న నాలుగో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్‌ ఓడినా.. డ్రా చేసుకున్న ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. తొలి మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియగా.. తొలి రెండు టీమిండియా గెలవగా.. ఇండోర్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 

చదవండి: Danny Morrison: అప్పుడు ఇండియా యువతి.. ఇప్పుడు ఆసీస్‌ యువతి

క్రికెట్‌లో కొత్త పంథా.. ఐపీఎల్‌ 2023 నుంచే మొదలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement