హోలీ సంబరాలు చేసుకునేందుకు సుంకేశుల జలాశయం వద్దకు వెళ్లి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు గురువారం బయటపడ్డాయి.
కర్నూలు : హోలీ సంబరాలు చేసుకునేందుకు సుంకేశుల జలాశయం వద్దకు వెళ్లి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు గురువారం బయటపడ్డాయి. కర్నూలు నగరంలోని సెంట్ జోసెఫ్ కళాశాలకు చెందిన 14 మంది డిగ్రీ విద్యార్థులు బుధవారం హోలీ వేడుకలు జరుపుకున్నారు. సాయంత్రం వారంతా సమీపంలోని సుంకేశుల జలాశయం వద్ద సంబరాల తర్వాత తిరిగి వచ్చే క్రమంలో భార్గవ్, చైతన్య అనే ఇద్దరు విద్యార్థులు తప్పిపోయారు. వారు రాత్రయినా తిరిగి రాకపోయేసరికి గురువారం ఉదయం కుటుంబసభ్యులు వెతికారు. అయితే ఈ రోజు ఉదయం జలాశయం గేట్ వద్ద వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.