
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత, సుస్థిర సాంకేతిక పరిష్కారాల్లో అగ్రగామిగా ఉన్న క్వాడ్రిక్ ఐటీ.. బయో ఏషియా 2025లో అద్భుతమైన ఆవిష్కరణలతో ప్రభావం చూపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను సుస్థిరతతో మిళితం చేస్తూ రూపొందించిన పలు ఉత్పత్తులు, పరిష్కారాలను ప్రదర్శించింది.
రీయూజబుల్ స్మార్ట్ ఏఐ నోట్ బుక్
క్వాడ్రిక్ ఐటీ అందించిన అద్భుతమైన ఆవిష్కరణలలో రీయూజబుల్ స్మార్ట్ ఏఐ ఆధారిత నోట్ బుక్ ఒకటి. సుమన్ బాలబొమ్ము, కేసరి సాయికృష్ణ శబనివీసు, రఘు రామ్ తాతవర్తి కలిసి రూపొందించిన ఈ నోట్ బుక్ సమావేశాల్లో నోట్స్ తీసుకునే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నోట్ బుక్ సంప్రదాయ నోట్ బుక్ లాగే పనిచేస్తుంది. కానీ ప్రతి పేజీని 100 సార్లు పునర్వినియోగించుకోవచ్చు. రెనోట్ఏఐ అనువర్తనాన్ని ఉపయోగించి చేతిరాత కంటెంట్‌ను డిజిటల్ ఫార్మాట్లోకి సులభంగా మార్చవచ్చు. అలాగే క్లౌడ్ స్టోరేజ్, ఏఐ-జనరేటెడ్ ప్రాంప్ట్‌ల ద్వారా సమాచారాన్ని కావాల్సినప్పుడు తిరిగి పొందవచ్చు. ఈ నోట్‌బుక్ పేజీలను తడి గుడ్డ లేదా టిష్యూతో తుడిచివేసి మళ్లీ ఉపయోగించవచ్చు. దీంతో కాగితం వినియోగం బాగా తగ్గుతుంది.
మరిన్ని ఏఐ పరిష్కారాలు
రీ యూజబుల్ స్మార్ట్ నోట్‌బుక్‌తో పాటు క్వాడ్రిక్ ఐటీ.. బయో, ఫార్మా పరిశ్రమల కోసం రూపొందించిన మరిన్ని కృత్రిమ మేధ, డేటా ఆధారిత పరిష్కారాలను ప్రదర్శించింది. ఈ ఆవిష్కరణలు కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతోపాటు వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడంలో దోహదపడతాయి. అలాగే పర్యావరణ హితానికి తోడ్పడతాయి.
Comments
Please login to add a commentAdd a comment