తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC), నవమ్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అత్యంత విజయవంతమైన 'ఇన్నోవేషన్ యాత్ర - 2024' ముగింపు వేడుకలకు ఆహ్వానించడానికి 'అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ (ACIC-CBIT), కాకతీయ శాండ్‌బాక్స్' ఎంతో ఉత్సాహంగా ఉన్నాయి. నెట్‌వర్క్ ఆఫ్ ఎకోసిస్టమ్ పాట్నర్స్, ఈవెంట్ స్పాన్సర్‌గా నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్), అసోసియేట్ పార్టనర్‌గా లాజులిన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.
2024 మార్చి 12 నుంచి ప్రారంభమైన ఐదు రోజుల బస్సు యాత్ర 16వ తేదీ ముగుస్తుంది. ఈ ప్రయాణం నిజామాబాద్ నుంచి ప్రారంభమై పర్యావరణ వ్యవస్థలను అన్వేషిస్తూ.. సాగుతుంది. ఈ ప్రయాణం నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట ప్రాంతాలలో పర్యటించి హైదరాబాద్‌లోని ఏసీఐసీ-సీబీఐటీలో ముగుస్తుంది.
ఇన్నోవేషన్ యాత్ర - 2024 చివరి రోజు ఇలా..
ఇన్నోవేషన్ యాత్ర - 2024 చివరి రోజు (మార్చి 16) యాత్రలో పాల్గొన్నవారు వారి విజయాలను జరుపుకుంటారు, వారి సృజనాత్మకను కూడా ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం 6 గంటలకు ACIC-CBIT, గండిపేటలో జరుగుతుంది. ఇన్నోవేషన్ యాత్ర - 2024 చివరి రోజు కార్యక్రమంలో పాల్గొనేవారు ఈ కింది విషయాలను తెలుసుకోవచ్చు.
- విజయవంతమైన వ్యవస్థాపకులు, స్థానిక ఆవిష్కర్తల నెట్‌వర్క్
- అనుభవాల ద్వారా సమాజ అవసరాల గురించి లోతైన అవగాహన
- సమస్యకు పరిష్కారం తెలుసుకునే నైపుణ్యం
- ఆలోచనను ఉపయోగించి వాస్తవ-ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడం
- భావసారూప్యత గల వ్యక్తుల సహాయక సంఘాన్ని నిర్మించడం
- గ్రామీణ ఆవిష్కర్తల కథల నుంచి ప్రేరణ
Comments
Please login to add a commentAdd a comment