conclude
-
ఇన్నోవేషన్ యాత్ర 2024: ఆలోచనకు పునాది వేయనున్న ముగింపు!
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC), నవమ్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అత్యంత విజయవంతమైన 'ఇన్నోవేషన్ యాత్ర - 2024' ముగింపు వేడుకలకు ఆహ్వానించడానికి 'అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ (ACIC-CBIT), కాకతీయ శాండ్బాక్స్' ఎంతో ఉత్సాహంగా ఉన్నాయి. నెట్వర్క్ ఆఫ్ ఎకోసిస్టమ్ పాట్నర్స్, ఈవెంట్ స్పాన్సర్‌గా నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్), అసోసియేట్ పార్టనర్‌గా లాజులిన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. 2024 మార్చి 12 నుంచి ప్రారంభమైన ఐదు రోజుల బస్సు యాత్ర 16వ తేదీ ముగుస్తుంది. ఈ ప్రయాణం నిజామాబాద్ నుంచి ప్రారంభమై పర్యావరణ వ్యవస్థలను అన్వేషిస్తూ.. సాగుతుంది. ఈ ప్రయాణం నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట ప్రాంతాలలో పర్యటించి హైదరాబాద్‌లోని ఏసీఐసీ-సీబీఐటీలో ముగుస్తుంది. ఇన్నోవేషన్ యాత్ర - 2024 చివరి రోజు ఇలా.. ఇన్నోవేషన్ యాత్ర - 2024 చివరి రోజు (మార్చి 16) యాత్రలో పాల్గొన్నవారు వారి విజయాలను జరుపుకుంటారు, వారి సృజనాత్మకను కూడా ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం 6 గంటలకు ACIC-CBIT, గండిపేటలో జరుగుతుంది. ఇన్నోవేషన్ యాత్ర - 2024 చివరి రోజు కార్యక్రమంలో పాల్గొనేవారు ఈ కింది విషయాలను తెలుసుకోవచ్చు. విజయవంతమైన వ్యవస్థాపకులు, స్థానిక ఆవిష్కర్తల నెట్వర్క్ అనుభవాల ద్వారా సమాజ అవసరాల గురించి లోతైన అవగాహన సమస్యకు పరిష్కారం తెలుసుకునే నైపుణ్యం ఆలోచనను ఉపయోగించి వాస్తవ-ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడం భావసారూప్యత గల వ్యక్తుల సహాయక సంఘాన్ని నిర్మించడం గ్రామీణ ఆవిష్కర్తల కథల నుంచి ప్రేరణ -
ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో ముగిసిన సీఎం భేటీ
-
ప్రశాంతంగా టెట్
పేపర్ 1కు 89%, పేపర్ 2కు 86%హాజరు ఓఎంఆర్ షీట్లపై పాత తేదీ తిరుపతిలో పరీక్ష రాస్తూ పట్టుబడిన టీచర్లు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆది వారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఉద యం నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 89% (56,546 మంది), మధ్యాహ్నం జరిగిన పేపర్-2కు 86.17% (3,39,251 మంది) అభ్యర్థులు హాజరయ్యారు. డీఎడ్ అభ్యర్థులు పేపర్-1, బీఎడ్ అభ్యర్థులు పేపర్ -2 రాయడానికి అర్హులు. రెండు పేపర్లు రాసిన అభ్యర్థులు దాదాపు 7 వేల మంది ఉన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె కారణంగా టెట్ పలుమార్లు వాయిదా పడడం తెలిసిందే. పరీక్ష వాయిదా పడినా.. ఓఎంఆర్ జవాబు పత్రాలపై తేదీని మాత్రం విద్యాశాఖ మార్చలేదు. పాత తేదీతో ముద్రించిన పత్రాల్నే అభ్యర్థులకిచ్చారు. బోధనేతర సిబ్బందినే ఇన్విజిలేటర్లుగా నియమించాలని నిబంధన ఉన్నా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఇది అమలు కాలేదు. బోధనా సిబ్బందినే ఇన్విజిలేటర్లుగా వినియోగించారు. తిరుపతిలో ముగ్గురు టీచర్లు పరీక్ష రాస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. పేపర్ -1 మ్యాథ్స్‌లో ‘స్పిరిట్ ఆఫ్ జామెట్రీ’ గ్రంథ రచయిత ఎవరు? అనే ప్రశ్నకు.. జవాబు గుర్తించడానికిచ్చిన 4 ఆప్షన్ల(రెనె డెకాట్రే, యూక్లిడ్, జార్జ్ కాం టర్, బ్లైజా పాస్కల్)లో సరైన జవాబు(రెనె మాగ్రిటే) లేదు. రెండ్రోజుల్లో ‘కీ’ విడుదల: టెట్ ప్రాథమిక కీ రెండు రోజు ల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రశ్న పత్రాల్లో తప్పులున్నట్లు గుర్తిస్తే.. ఆ ప్రశ్నలకు అభ్యర్థులందరికీ గ్రేస్ మార్కులు ఇస్తామని చెప్పారు. టెట్ ఫలితాలు ఏప్రిల్ 2న ప్రకటించడానికి ప్రయత్నిస్తామన్నారు. సాధ్యం కాకపోతే ఏప్రిల్ తొలివారంలో విడుదల చేస్తామన్నారు.