‘వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం కావాలి’ | Telangana Man Cycle Yatra To Achieve Again Ys Jagan Cm In 2024 | Sakshi
Sakshi News home page

‘వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం కావాలి’

Published Tue, Jun 27 2023 8:11 AM | Last Updated on Tue, Jun 27 2023 9:37 AM

Telangana Man Cycle Yatra To Achieve Again Ys Jagan Cm In 2024 - Sakshi

జగ్గయ్యపేట(ఎన్టీఆర్‌): సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి కూడా సీఎం కావాలని కోరుతూ తెలంగాణకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత చేపట్టిన సైకిల్‌ యాత్ర సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించింది. జనగామ జిల్లా బచ్చనపేట మండలం లింగంపల్లికి చెందిన బొడ్డు ప్రవీణ్‌ రెండోసారి జగన్‌ సీఎం కావాలని కోరుతూ ఈ నెల 21న జనగామ నుంచి తాడేపల్లి వరకు సైకిల్‌ యాత్ర ప్రారంభించారు.

సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు యాత్ర చేరుకోవడంతో.. పట్టణంలోని బైపాస్‌ రోడ్డులోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ రెండో సారి కూడా ముఖ్యమంత్రి అయితే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. ప్రజలు, భగవంతుడి ఆశీస్సులతో ఆయన కచ్చితంగా విజయం సాధిస్తారని తెలిపారు.

చదవండి: చల్లటి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement