
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్‌లో వ్యవసాయం, వలస కూలీల సంక్షేమానికి చేపట్టిన చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వెల్లడించారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తామని, వారి కోసం పలు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రకటించారు. రూ 86,600 కోట్ల వ్యవసాయ రుణాలు ఆమోదించామని తెలిపారు. పాతిక లక్షల మంది నూతన కిసాన్‌కార్డు దారులకు రూ 25,000 కోట్ల రుణం అందచేస్తామని తెలిపారు. వలస కూలీలకు ఊరట కల్పించే చర్యలు ప్రకటించామని చెబుతూ మధ్యతరగతి కోసం ప్రత్యేకంగా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం ప్రవేశపెడతామని మంత్రి వెల్లడించారు.
చదవండి : ఏ దేశం ఎలా ఖర్చు చేసింది
ప్యాకేజ్ వివరాలు
మార్చి, ఏప్రిల్‌లో రైతులకు రూ 86,600 కోట్ల రుణాల ఆమోదం
చిన్నసన్నకారు రైతులకు రూ 4 లక్షల కోట్ల రుణాల మంజూరు
25 లక్షల మంది నూతన కిసాన్‌కార్డుదారులకు రూ 25,000 కోట్ల రుణం
వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు రాష్ట్రాలకు రూ .6700 కోట్లు
నాబార్డు ద్వారా 29,500 గ్రామీణ బ్యాంకులకు నిధులు
రబీలో సన్నకారు, మధ్యతరహా రైతులకు రూ 30 వేల కోట్ల రుణాలు
సహకార బ్యాంకుల ద్వారా 3 వేల కోట్ల మంది రైతులకు అదనంగా రుణాలు
చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు వివిధ పథకాలు
రైతులు,పేదల కోసం 9 పాయింట్ ఫార్ములా
వలస కూలీలను ప్రభుత్వం విస్మరించలేదు
రైతులను ఆదుకునేందుకు ప్యాకేజ్‌లో రెండు పథకాలు
సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు
రైతులకు మరిన్ని పథకాలు కొనసాగుతాయి
రైతులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అందుబాటులో నగదు
వలస కార్మికుల ఉపాథికి రూ 10,000 కోట్లు
వలస కార్మికులు, వీధి వ్యాపారులపై ప్రత్యేక దృష్టి
రోజుకు కనీస వేతనం రూ 182 నుంచి రూ 202కు పెంపు
పట్టణ పేదల వసతికి రాష్ట్ర విపత్తు నిధుల వినియోగానికి అనుమతి
గ్రామీణ మౌలిక వసతులకు రూ 4200 కోట్లు
ఎస్‌ఆర్‌డీఎఫ్ కింద 11,002 కోట్ల నిధులు
మార్చి 1 నుంచి మే 31 వరకూ రుణాలు చెల్లించే రైతులకువారికి వడ్డీ రాయితీ
వచ్చే రెండు నెలలు వలస కూలీలకు ఉచిత రేషన్
రేషన్‌కార్డు లేని వారికి పదికిలోల బియ్యం, శనగలు
నగరాల్లో నిరాశ్రయులకు బలవర్ధక ఆహారం
కార్మికులందరికీ కనీస వేతన హక్కు
ఫ్లాట్‌ఫాం వర్కర్లకు సామాజిక భద్రత పథకం
కార్మికులకు ఉద్యోగ నియామక పత్రాలు
ఈ రేషన్ కార్డుతో ఎక్కడైనా సరుకులు తీసుకునే వెసులుబాటు
రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్‌ల ఏర్పాటు
ప్రధాన నగరాల్లో ప్రభుత్వ నిధులతో నిర్మాణం
50 లక్షల వీధి వ్యాపారులకు రూ. 5,000 కోట‍్ల రుణాలు
వీధి వ్యాపారులకు రుణ పరిమితి పెంపు
డిజిటల్ పేమెంట్లు చేసేవారికి మరిన్ని రాయితీలు
మధ్యతరగతి వారికి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం
రూ.6-18 లక్షల వార్షికాదాయం ఉన్న వారికి రాయితీ
2021 మార్చి వరకూ ఈ పథకం వర్తింపు
అర్బన్, సెమీ-అర్బన్‌లో ఉపాథి కల్పనకు రూ. 6000 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment