హోదా ఇవ్వలేం | only financial package for andharapradesh, says arun jaitley | Sakshi
Sakshi News home page

హోదా ఇవ్వలేం

Published Thu, Sep 8 2016 2:55 AM | Last Updated on Sat, Jun 2 2018 2:08 PM

హోదా ఇవ్వలేం - Sakshi

హోదా ఇవ్వలేం

అధికారికంగా ప్రకటించిన కేంద్రం
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు  అటు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ఇటు ప్యాకేజీ ఇవ్వకుండా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక కంటి తుడుపు ప్రకటన చేశారు. హోదాకు బదులుగా దానిని భర్తీ చేసేందుకు హోదా ఉంటే ఎంతమేర ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు(ఈఏపీ) వచ్చేవో అంతమేర ఆ ఈఏపీ ప్రాజెక్టులను ఇవ్వడం ద్వారా సహాయం చేస్తామని ప్రకటిం చారు. పైగా చట్టబద్ధంగా అమలుకావాల్సిన రైల్వేజోన్ గానీ, కడప స్టీలు ప్లాంటు గానీ, దుగరాజపట్నం నౌకాశ్రయం గానీ ఉంటుందన్న భరోసా ఇవ్వలేదు. 

మధ్యాహ్నం నుంచి ఎప్పుడెప్పుడు ప్రకటన వస్తుందా అని ఎదురుచూసిన ప్రజలకు రాత్రి 10.47 గంటలకు జైట్లీ చేసిన ప్రకటన ఉసూరుమనిపించింది. ఆర్థిక శాఖ రూపొందించిన సాయం ప్రకటనను సీఎంకు పంపించి ఆయన సమ్మతించిన తరువాతే టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనాచౌదరితో కలిసి అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు ఈ ప్రకటన చేశారు.
 
అసెంబ్లీ సీట్ల కోసమే పట్టు..
ప్యాకేజీ ప్రకటనపై ఉదయం హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో, తదుపరి వెంకయ్యతో సుజ నా చౌదరి, టీడీపీ ఎంపీ సి.ఎం.రమేశ్ భేటీ అయ్యారు. అయితే బాబు సమక్షంలో ప్రకటన చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో సీఎంను వెంకయ్య ఢిల్లీకి రమ్మని ఆహ్వానించినట్టు ప్రచా రం జరిగింది. ఎట్టకేలకు 10.47కు జైట్లీ ప్రకటన చేశారు. అయితే, 10రోజుల క్రితమే ము సాయిదాను రూపొందించిన ఆర్థిక శాఖ ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, అటు ప్రధాని ఆమోదం పొంది ప్రకటన కోసం వేచి చూస్తూ ఉంది.
 
కానీ బుధవారమే ఈ ప్రకటన ను సీఎం పరిశీలించినట్టు.. ఆయన సంతృప్తి చెందనట్టు నాటకాన్ని రక్తికట్టించారు. సీఎం  డిమాండ్ చేస్తున్న అసెంబ్లీ సీట్ల పెంపును ఈ ప్రకటనలో చేర్చాలని సుజనా, సీఎం రమేశ్.. జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌తో సంప్రదింపులు జరిపి నా దానికి కేంద్రం సమ్మతించలేదు. రాజ్యాంగ సవరణతో ముడిపడి ఉన్నందున కుదరదని తేల్చేసింది. చివరగా పలు అంశాలపై సంబంధిత శాఖలు నిర్ణయం తీసుకుంటాయన్న సవరణ ప్రకటనను సిద్ధం చేసుకుని జైట్లీ విలేకరుల భేటీలో సంబంధిత వివరాలు వినిపించారు.
 
ఇదే ఆ సాయం..: అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన సారాంశం ఇలా ఉంది.. ‘పార్లమెంటు సమావేశాల అనంతరం గత కొద్ది రోజులు కేంద్రం నూతన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పలు అంశాలను పరిశీలన చేస్తూ వచ్చింది. ఏపీకి కేంద్ర సాయం అందించేందుకు 4 అంశాలు దోహదపడుతున్నాయి. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 14వ ఆర్థిక సంఘం ద్వారా రెవెన్యూ లోటు భర్తీ, విభజన రోజున ప్రధాని  ఇచ్చిన  హామీలు, నీతిఆయోగ్ చేసిన సిఫారసులు.. ఈ 4 రూపాల్లో ఏపీకి సాయం దక్కుతుంది.

ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో చేసిన హామీలన్నింటినీ  అమలుచేస్తామని కేంద్రం  చెప్పింది. వాటన్నింటికీ కట్టుబడి ఉన్నాం. తొలి ఏడాది రెవెన్యూ లోటు భర్తీకి రూ. 3975 కోట్లు ఇచ్చాం. మిగిలిన మొత్తాన్ని  ఇస్తాం. అలాగే రాజధాని నిర్మాణానికి 2500 కోట్లు ఇచ్చాం. వెనకబడిన ప్రాంతాలకు రూ. 1050 కోట్లు ఇచ్చాం. జాతీయ స్థాయి సంస్థలు నెలకొల్పాం.  మంజూరు చేయాల్సిన వాటికి సంబంధించి కార్యచరణ జరుగుతోంది. వీటి ఏర్పాటుకు  క ట్టుబడి ఉన్నాం..’ అని అన్నారు.
 
2014 తరువాతి ఖర్చే..: ‘పోలవరం ప్రాజెక్టును ఇప్పటికే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాం. అందువల్ల 1-4-2014 తేదీన జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రం భరిస్తుంది.

ప్రాజెక్టు పూర్తికి నాబార్డ్ నుంచి రుణం తీసుకుని దాన్ని కేంద్రం చెల్లిస్తుంది. అలాగే ఈ ప్రాజెక్టుపై రాష్ట్రానికి  ప్రత్యేక శ్రద్ధ, అవసరం ఉన్నందున ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రానికే అప్పగిస్తున్నాం.. పన్ను రాయితీలు ఇదివరకే ప్రకటించాం. డిప్రీసియేషన్, ఇన్వెస్ట్‌మెంట్ అలవెన్స్‌లపై  ఉత్తర్వులు జారీచేశాం. ఇక మన్మోహన్ ప్రకటించిన 6 అంశాలు ఐదింటిని వేర్వేరు రూపాల్లో అమలుచేస్తున్నాం.  మిగిలింది ప్రత్యేక హోదా.  
 
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కూడా అదనపు రెవెన్యూ గ్రాంట్లే ఇస్తూ వస్తున్నాం. అయితే ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలను మేం అర్థం చేసుకోగలం. కానీ ప్రత్యేక హోదా ప్రకటన తరువాతే 14వ ఆర్థిక సంఘం వచ్చింది.   దీనిని మేం పరిశీలించాం. ప్రధాని ప్రకటన ఉద్దేశం ఆర్థికంగా సాయం చేయడమే. అందువల్ల కేంద్రం హోదాకు బదులు ప్రత్యేక సాయాన్ని అందించ దలిచింది. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఏమేరకు లబ్ధి చేకూరేదో ఆ మేరకు  ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల రూపంలో సాయం చేస్తాం.

దీనిని విభజన నాటి నుంచి ఐదేళ్ల పాటు అమలుచేస్తాం. ఈ 7 పేజీల్లో ఉన్న అంశాలకు ఒకవేళ కేబినెట్ ఆమోదం అవసరమైతే ఆమోదం పొందిన తరువాత ఈ నివేదికను మీడియాకు విడుదల చేస్తాం. ఇక రైల్వే జోన్, స్టీలు ప్లాంటు, అసెంబ్లీ సీట్ల పెంపు తదితర అంశాలను ఆయా శాఖలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాయి’ అనిఅన్నారు.

రాజధానికి సాయంపైన గానీ, ఎక్స్‌టెర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల విషయంలోగానీ నీతి ఆయోగ్ చేసే గణాంకాల ఆధారంగా సాయం చేస్తామన్నారు. ఇప్పటికే ఉన్న అంచనాల ప్రకారం ఈ ఎక్స్‌టెర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల ద్వారా ఏటా 2500 కోట్ల మేర నిధులు అందుతాయని తెలుస్తోంది. రైల్వే జోన్‌ను విజయవాడలో ఏర్పాటు చేయబోతున్నారా? అని అడగ్గా..  రైల్వే శాఖ చూస్తుందని పేర్కొన్నారు.
 
 నిరంతర సాయం..: వెంకయ్య
వెంకయ్య మాట్లాడుతూ.. ‘ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా పరిగణిస్తాం.. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సాయాన్ని అందిస్తాం. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు, విద్యాసంస్థలు మంజూరు అయ్యాయి. అవి పనిచేస్తున్నాయి. మిగిలిన గిరిజన వర్సిటీ, కడప స్టీల్ ప్లాంట్ వీటి ఏర్పాటుపై కూడా ఒక టాస్క్‌ఫోర్స్‌ను నియమించాం. ఏపీకి కేంద్ర సాయం చేయడం అనేది నిరంతర ప్రక్రియ.  ఏపీని విభజించిన తీరు వల్ల కేంద్ర సాయం అత్యవసరం.

దీన్ని దృష్టిలో ఉంచుకుని మిగతా రాష్ట్రాలతో సమాన స్థాయికి చేరే వరకు ఏపీకి అన్ని విధాల సాయపడతాం. చట్టంలో పేర్కొన్న వాటిలో ఇప్పటికే ఎక్కువ భాగం అమలు చేశాం. మిగతా వాటినీ త్వరలో చేస్తాం. చట్టంలో పేర్కొన్న లాంగ్వేజ్‌కు అనుగుణంగా 10 ఏళ్లలోపు హామీ ఇచ్చిన సంస్థలను ఏర్పాటు చేయాలని, కానీ దాని కన్నా ముందుగా ఆయా సంస్థల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం.

ప్రాజెక్టుల యోగ్యతకు అధ్యయనాన్ని మాత్రమే చట్టంలో పొందుపరిచారు. ప్రాజెక్టులను శంకుస్థాపన చేస్తే సరిపోదు. వా టికి ఆర్థిక యోగ్యత ఉందా లేదా కూడా పరి శీలించాలి. గతంలో శంకుస్థాపన చేసిన పలు పరిశ్రమలు ఇప్పటికీ ప్రారంభం కాని సంగతిని దృష్టిలో పెట్టుకోవాలి..’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement