
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ 20 లక్షల కోట్ల ప్యాకేజ్‌లో మూడవ విడత ఉద్దీపన చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం వెల్లడించారు. వ్యవసాయం, సాగు అనుబంధ రంగాలకు ఊతమిచ్చే చర్యలను ఆమె ప్రకటించారు. వ్యవసాయంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ కాలంలో రైతుల ఖాతాల్లో రూ. 18,730 కోట్లను జమచేయడంతో పాటు రైతుల నుంచి రూ 74,300 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ఊతమిచ్చేలా ఉద్దీపన ప్రకటించామని పేర్కొన్నారు.
చదవండి : ‘ఉద్దీపన ప్యాకేజ్‌తో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం’
ప్యాకేజీ 3.0: పూర్తి సారాంశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మూడవ విడత ప్యాకేజ్ వివరాలు
వ్యవసాయం అనుబంధ రంగాలపై ప్యాకేజ్ ప్రకటన
మత్స్య, పశుసంవర్థక ,డెయిరీ , ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఊతం
మూడో విడత ప్యాకేజ్‌లో 11 అంశాలపై దృష్టి
వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కోసం రూ లక్ష కోట్లతో నిధి
కోల్డ్‌స్టోరేజ్‌లు, ధాన్యాల గిడ్డంగుల నిర్మాణం
లాక్‌డౌన్‌లో రైతుల ఖాతాల్లో రూ 18,700 కోట్ల నగదు బదిలీ
రైతుల నుంచి రూ 74,300 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు
డెయిరీ రైతులకు రూ 5వేల కోట్లతో అదనపు సాయం
2 కోట్ల మంది డెయిరీ రైతులకు లబ్ధి
రూ 30 వేల కోట్లతో రైతులకు అత్యవసర సహాయ నిధి
సహాయ నిధితో 3 కోట్ల మంది రైతులకు లబ్ధి
ఆక్వా రైతుల ఎగుమతుల కోసం ప్రత్యేక కార్యాచరణ
స్ధానిక ఉత్పత్తుల ఎగుమతుల కోసం రూ 10,000 కోట్లతో నిధి
చిన్నతరహా ఫుడ్ ప్రాసెసింగ్ సంస్ధల కోసం రూ 10,000 కోట్లతో నిధి
రెండు లక్షల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు లబ్ధి
మత్స్య అనుబంధ రంగాలకు రూ 20,000 కోట్లు
మెరైన్ ఎగుమతుల పెంపునకు 55 లక్షల ఉద్యోగాలు
ఆక్వా కల్చర్‌కు రూ 11,000 కోట్లతో నిధి
ప్రధాని మత్స్యసంపద యోజన కింద రూ 20,000 కోట్లతో నిధి
మత్స్యకారులకు బీమా సౌకర్యం
పశుసంవర్ధక మౌలిక వసతులకు రూ 15,000 కోట్లు
పశువులు, జీవాలకు వ్యాక్సిన్‌ల కోసం రూ 13,300 కోట్లు
53 కోట్ల జీవాలకు నూరు శాతం వ్యాక్సినేషన్
ఔషధ మొక్కల సాగుకు రూ 4000 కోట్లతో నిధి
తేనెటీగల పెంపకందారులకు రూ 5000 కోట్లు
ధరల నియంత్రణకు నిత్యవసర చట్టంలో మార్పులు
Comments
Please login to add a commentAdd a comment