
హైదరాబాద్: ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి అక్రమంగా చొరబడడంతో పాటు ఆమెను నిర్బంధించి దాడి చేయడమే కాకుండా ఇంటిని ధ్వంసం చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలతో ఇద్దరు నిందితులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిలింనగర్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... ఫిలింనగర్‌లోని వినాయక్‌నగర్ బస్తీలో నివసించే కవిత అనే మహిళ ఇంట్లోకి అదే బస్తీకి చెందిన పిల్లికళ్ల కురుమూర్తి(38), పిల్లికళ్ల శేఖర్(32) మద్యం మత్తులో ప్రవేశించి దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా ఇంట్లోని సామాన్లను ధ్వంసం చేస్తూ వీరంగం సృష్టించారు.
కిటీకి అద్దాలతో పాటు టీవీని ధ్వంసం చేశారు. పూల కుండీలు ఎత్తేస్తూ ఇళ్లంతా బీభత్సం సృష్టించడంతో పాటు ఆమెను భయాందోళనకు గురిచేశారు. అడ్డుకునేందుకు ప్రయతి్నంచిన కవితపై దాడికి దిగారు. ప్రాణాలు ఆరచేతుల్లో పెట్టుకున్న బాధితురాలు వారి బారినుంచి తప్పించుకుని ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై ఐపీసీ 452,.354(బి), 341, 323, 427 నాన్‌బెయిలబుల్‌సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.
ఇదిలా ఉండగా వీరిద్దరూ ఇటీవల బోనాల పండగ రోజు కూడా మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. దీంతో పాటు దాడులకు పాల్పడడుతూ ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయింది. ఆ ఘటన మరువక ముందే మరోమారు వీరిద్దరూ బస్తీలో దౌర్జన్యానికి దిగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వరుస సంఘటనలతో వినాయక్‌నగర్‌లో పెరిగిపోతున్న దౌర్జన్యాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment