
ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో టాలీవుడ్ ప్రముఖులు
హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో టాలీవుడ్ ప్రముఖులు పలువురు కనువిందు చేశారు. ఫిలింనగర్‌లోని దైవసన్నిధానంలో మరో మూడు కొత్త ఆలయాలు రూపుదిద్దుకోనున్నాయి. వీటి పనులను స్వరూపానందేంద్ర స్వామి బుధవారం ప్రారంభించారు. మూడు విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసి సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఈ నూతన ఆలయాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, నటులు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. మురళీమోహన్, వెంకటేష్, నాగార్జున, చాముండేశ్వరీనాథ్, నిమ్మగడ్డ ప్రసాద్, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.