ఫిలింనగర్‌లో దారుణం.. | Young Man Brutally Murdered In Film Nagar | Sakshi
Sakshi News home page

ఫిలింనగర్‌లో యువకుడి దారుణ హత్య

Published Mon, Jul 29 2019 4:21 PM | Last Updated on Mon, Jul 29 2019 4:24 PM

Young Man Brutally Murdered In Film Nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో దారుణం చోటుచేసకుంది. ఫిలింనగర్‌లో సోమవారం ప్రేమ్‌ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే స్నేహితులే ప్రేమ్‌ను కొట్టి చంపినట్టుగా తెలుస్తోంది. ప్రేమ్‌కు, సతీశ్‌ అనే వ్యక్తికి మధ్య ఉన్న విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గంజాయి తాగుదామని సతీశ్‌ అనే వ్యక్తి ప్రేమ్‌ను పిలిచారు. గంజాయి తాగిన అనంతరం మత్తులో ప్రేమ్‌కు, సతీశ్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న మిగతా వ్యక్తులు ప్రేమ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రేమ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement