
ఫైల్ ఫోటో
సాక్షి, బంజారాహిల్స్: ప్రేమ పేరుతో ఓ బాలికను బలవంతంగా అత్యాచారం చేసిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిలింనగర్‌లోని వినాయకగనర్ బస్తీలో నివసించే మహేష్ అలియాస్ కృష్ణ చైతన్య(20), డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అదే బస్తీలో నివసించే 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని(16), ను గత నెల నుంచి ప్రేమిస్తున్నానని మాయా మాటలతో నమ్మించాడు.
చదవండి: తియ్యటి మాటలు.. అందమైన ప్రొఫైల్ ఫోటోతో కోట్లు కొట్టేసింది
ఆ తర్వాత ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. గత నెల 14వ తేదీన మహేష్ తన ద్విచక్రవాహనంపై బాలికను తన పిన్ని ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండ్రోజుల క్రితం బాలిక ఏడుస్తుండగా తండ్రి ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని చెప్పింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మహేష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: వివాహేతర సంబంధం: చంపేసి.. చెట్ల పొదల్లో పడేసి..
Comments
Please login to add a commentAdd a comment