
అది ఫిలింనగర్ బస్టాప్. ఓ మహిళను ఆమె భర్త కర్రతో విచక్షణారహితంగా కొడుతున్నాడు. ఆమె రోదిస్తూ కాళ్లావేళ్లాపడుతున్నా కనికరించడంలేదు. చుట్టుపక్కల వారంతా చోద్యం చేస్తున్నారే, కానీ ఏ ఒక్కరూ ఆపేందుకు ప్రయతి్నంచడంలేదు. హైదరాబాద్‌లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ సతీమణి వ్యాన్ ఫ్లెమింగ్ అదే సమయంలో ఫిలింనగర్ మీదుగా జూబ్లీహిల్స్‌కు కారులో వెళుతున్నారు. వెంటనే కారు దిగి వెళ్లి దాడిని వారించారు. అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. బాధితురాలిని ఫ్లెమింగ్ అక్కున చేర్చుకొని ఓదార్చారు. ఏం జరిగిందని ఆరా తీశారు. తన భర్త రోజూ కొడుతున్నాడని, గదిలో బంధిస్తున్నాడని చెబుతూ బాధితురాలు కన్నీరుమున్నీరైంది. స్నేహితులకు సమాచారం ఇచ్చి ఎవరికి ఫిర్యాదు చేయాలంటూ ఫ్లెమింగ్ అడిగారు. దీనిపై ఆండ్రూ ఫ్లెమింగ్ కూడా స్పందించారు. గురువారం జరిగిన ఈ ఘటనపై ఉమెన్ సేఫ్టీ ఐజీకి సమాచారం అందించారు.
– బంజారాహిల్స్
Comments
Please login to add a commentAdd a comment