బంజారాహిల్స్: ఫిలింనగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీలో ఈనెల 24న నిర్మాణంలో ఉన్న పోర్టికో కూలి ఇద్దరు కూలీలు మృతి, 8 మందికి తీవ్రగాయాలైన ఘటనలో బంజారాహిల్స్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సైట్ ఇంజినీర్ ఎం.సుధాకర్‌రావు, లేబర్ కాంట్రాక్టర్ ఈ.కొండల్‌రావు, సెంట్రింగ్ కాంట్రాక్టర్ ఎ.బాలరాజులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 304(ఏ), 337, 338, 288, 461 క్లాజ్ –4 ఆఫ్ జీహెచ్‌ఎంసీ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోర్టిగో నిర్మాణం జరుగుతుండగా వీరంతా తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు రావడంతో కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా సెంట్రింగ్ పిల్లర్లు సరిగా వేయకపోవడంతో అవి కదిలి కుప్పకూలినట్లు కూడా వెల్లడైంది.