
కొత్త జీవితాన్నిచ్చిన నగరమిది..
చిన్నతనం నుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ఆ పిచ్చితోనే ఇక్కడికి వచ్చాను. అమ్మా నాన్న నాకు జన్మనిస్తే ఈనగరం పునర్జన్మనిచ్చింది. అసలు హైదరాబాద్ లేకపోతే మాలాంటి వాళ్లకు ఏ రకంగా అవకాశాలొస్తాయి..! ఈ మహానగరం ఎందరికో ఉపాధి కల్పిస్తోంది. చాలా మంది హైదరాబాద్‌లో ఏం ఇష్టమని అడుగుతారు? నా దగ్గర నుంచి ఏ గోల్కొండో, చార్మినార్ ఇలాంటివి ఊహిస్తారు. కానీ నాకు నచ్చిన ప్లేస్ ఫిలింనగర్. ఇక్కడ నుంచే నా పోరాటం స్టార్ట్ అయింది. ఈ ప్రయాణంలో నగరం నాకు మంచి మిత్రులను పరిచయం చేసింది. బతకడం నేర్పించింది. నా జీవితానికి కొత్త అర్థం నేర్పిన నగరమిది.
- షకలక శంకర్