ఇల్లు మారిన మోహన్బాబు | manchu mohan babu family shifted to shamshabad | Sakshi
Sakshi News home page

ఇల్లు మారిన మోహన్బాబు

Published Mon, Aug 18 2014 8:56 AM | Last Updated on Tue, Oct 2 2018 3:40 PM

ఇల్లు మారిన మోహన్బాబు - Sakshi

ఇల్లు మారిన మోహన్బాబు

విలక్షణ నటుడు మంచు మోహన్బాబు కుటుంబం కొత్త ఇంటిలోకి మారింది.

హైదరాబాద్: విలక్షణ నటుడు మంచు మోహన్బాబు కుటుంబం కొత్త ఇంటిలోకి మారింది. ఫిల్మ్నగర్ నుంచి శంషాబాద్ కు ఆయన కుటుంబం వెళ్లిపోయింది. ఆగస్టు 15న శంషాబాద్ లోని కొత్త ఇంట్లోకి వీరి కుటుంబం గృహప్రవేశం చేసింది. మోహన్బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు గృహప్రవేశానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. దగ్గరి స్నేహితులు, సన్నిహితులను మాత్రమే గృహప్రవేశానికి ఆహ్వానించారు.

నూతన గృహంలో తమ అభిరుచికి తగ్గినట్టు డిజైన్ చేయించుకున్న ఇంటీరియర్ ఆహ్వానితులను ఆకట్టుకుంది(ట). మోహన్బాబు కుటుంబం చాలా ఏళ్లుగా ఫిల్మ్నగర్ లో నివసిస్తోంది. మోహన్బాబు ఇల్లు లాండ్ మార్క్ లా ఉండేది. అయితే ఈ ఇల్లు ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో తరచుగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయి. ఈ కారణంతోనే మోహన్బాబు శంషాబాద్ కు మారినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement