ముగ్గురి రిమాండ్..
ఫిలింనగర్: నూతన సంవత్సర వేడుకల వేళ ఫిలింనగర్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్స్‌తో పాటు ఓ కొనుగోలుదారును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. షేక్‌పేటలోని ఫాల్కన్ కాలనీలో నివసించే ఎండీ అబ్దుల్ ఇర్ఫాన్ కారు డీలర్‌గా పని చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి షేక్ మహ్మద్ రెహమాన్ అలీ న్యూ ఇయర్ వేడుకలకు అవసరమైన వారికి డ్రగ్స్ విక్రయించేందుకు ముంబై నుంచి ఇటీవలే ఎండీఎంఏ డ్రగ్స్‌ను నగరానికి తీసుకువచ్చాడు. ఇర్ఫాన్‌తో కలిసి నాలుగు రోజుల పాటు డ్రగ్స్ విక్రయించాలని పథకం వేశాడు.
ఇందులో భాగంగానే ఫిలింనగర్‌లోని కొత్త చెరువు వద్దకు రెహమాన్ అలీ చేరుకుని మరో పెడ్లర్ ఇర్ఫాన్‌ను అక్కడికి పిలిపించాడు. అవసరమైన వారికి సరుకును విక్రయించే క్రమంలో బహదూర్‌పురాకు చెందిన సయ్యద్ హజ్మతుల్లాను పిలిపించారు. కొత్త చెరువు వద్ద వీరిద్దరూ కలిసి హజ్మతుల్లాకు డ్రగ్స్ ఇచ్చే క్రమంలో అప్పటికే సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.
రెహమాన్ అలీ ఇటీవలే డ్రగ్స్‌ను ముంబై నుంచి తీసుకు వచ్చినట్లుగా తేల్చారు. ఇర్ఫాన్‌తో కలిసి డ్రగ్స్‌ను విక్రయించాలని పథకం వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కొనుగోలు చేయడానికి వచి్చన హజ్మతుల్లాతో పాటు వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి పెద్ద ఎత్తున ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment