
పాతాళగంగ పైకొచ్చె..
సాక్షి,హైదరాబాద్: మహానగరంలో నీటికి పడే ఇక్కట్లు అందరికీ తెలిసింది. బిందె నిండాలంటే కుళాయి వద్ద ఒక పూటంతా ఎదురు చూడాలి. అలాంటిది ఫిలింనగర్‌లోని బీజేఆర్ నగర్ బస్తీలోని కొన్ని బోర్లలో నీరు వాటంతట అవే పైకి ఉబికి వస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు బాగా పెరిగాయి. దీనిమూలంగా నీరు బోర్ల నుంచి తన్నుకు వస్తుండడంతో బస్తీవాసులు ఆనందాశ్చర్యాలకు లోనవుతున్నారు.