నిజమా!
ఫిలిం నగర్‌లో ప్రచారమయ్యే వార్తల్లో కొన్ని నిజమవుతాయ్? కొన్ని ప్రచారాలుగానే మిగిలిపోతాయ్. ప్రస్తుతం ఫిలింనగర్‌లో షికారు చేస్తున్న ఓ వార్త నిజమవుతుందో లేదో చెప్పలేం. ఇంతకీ ఆ వార్త ఏంటంటే... రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో దానయ్య ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘బాద్‌షా’ చిత్రం ప్రారంభోత్సవానికి రామ్‌చరణ్ అతిథిగా విచ్చేసిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ విధంగా ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందన్న విషయం బయటికొచ్చింది.
అలాగే, శ్రీను వైట్లతో ఎన్టీఆర్‌కి మంచి ర్యాపో ఉంది. ఎన్టీఆర్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఈ కారణాలు చాలవా? అని కూడా గాసిప్పురాయుళ్లు చెప్పుకుంటున్నారు. ఏది నిజమో? ఏంటనేది త్వరలో తెలుస్తుంది.