
నిర్మాత కొడుక్కి పోలీసు నోటీసులు
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో సభ్యుడి పర్సులో నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డు తస్కరించారు.
అందులో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయి. గంట వ్యవధిలోనే ఆయన అకౌంట్‌లో నుంచి రూ.2.12 లక్షలు ఆన్‌లైన్ ద్వారా బదిలీ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీలు, బ్యాంకు అంకౌట్‌లు తనిఖీ చేసి ఇందుకు కారకుడిగా సి. కల్యాణ్ కొడుకు వరుణ్‌కుమార్‌ను గుర్తించారు. ఆయనపై చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు. స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా డీఐ వెంకటేశ్వర్‌రెడ్డి ఈ నోటీసు జారీ చేశారు.