Odisha chief minister
-
Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
భువనేశ్వర్: ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాజకీయ పర్యాటకులు తమ రాష్ట్రానికి తరలివస్తున్నారని, తమపై వ్యక్తిగత దూషణలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ మండిపడ్డారు. తమ ప్రజలపై ఈ రాజకీయ పర్యాటకుల ప్రభావం ఏమాత్రం ఉండదని తేలి్చచెప్పారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పొలిటికల్ టూరిస్టులుగా మారిపోయారని, కేవలం ఎన్నికల సమయంలోనే వారు ఒడిశాలో కనిపిస్తారని, ఆ తర్వాత మటుమాయం అవుతారని ఎద్దేవా చేశారు. నవీన్ పటా్నయక్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ పర్యాటకులు అనుచితమైన భాష ఉపయోగిస్తున్నారని, అది తమ రాష్ట్ర ప్రజలు సహించబోరని హెచ్చరించారు. -
విద్యార్థులకు సీఎం విజయమంత్రం
ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యాపకుడి అవతారం ఎత్తారు. కరేజ్, కన్విక్షన్, కమిట్మెంట్ అనే మూడు 'సి'లతో కూడిన విజయమంత్రాన్ని విద్యార్థులకు బోధించారు. జీవితంలో విజయం సాధించాలంటే ఈ మూడు పదాలు తప్పనిసరిగా అవసరమని ఆయన చెప్పారు. రాష్ట్రస్థాయి విద్యార్థుల సదస్సులో మాట్లాడిన పట్నాయక్.. విద్యార్థులకు జీవిత పాఠాలు బోధించారు. ఏదైనా ఒక అంశానికి కట్టుబడి ఉంటే.. నిబద్ధత, ధైర్యాలతో ముందుకెళ్లాలని, అప్పుడు తప్పనిసరిగా జీవితంలో విజయం సాధించి తీరుతారని ఆయన అన్నారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) విద్యార్థి విభాగం ఈ సదస్సును నిర్వహించింది. విద్యార్థులు, యువత భాగస్వామ్యంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి విద్యార్థులకు తెలిపారు. గతంలో రాష్ట్రంలో నెలకొన్న కరువు గురించి ప్రస్తావిస్తూ.. ఒడిషాకు ప్రకృతి విపత్తులు కొత్తేమీ కాదని ఆయన తెలిపారు. వరదలు, తుపాన్లు, కరువు లాంటి పరిస్థితులను వరుసపెట్టి గత 15 ఏళ్లుగా ఎదుర్కొంటూనే ఉన్నామని, ప్రస్తుత కరువు పరిస్థితిని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పట్నాయక్ చెప్పారు. -
సీఎం బర్త్‌డే వేడుకల్లో 11 మందికి గాయాలు
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ బెలూన్ పేలడంతో 11 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో భువనేశ్వర్ రమాదేవి మహిళ యూనివర్సిటీకి చెందిన 9మంది విద్యార్థినులు ఉన్నారు. శుక్రవారం విద్యార్థులు నవీన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ కార్యాలయం వద్ద గ్యాస్ బెలూన్ పేలడంతో విద్యార్థులు గాయపడ్డారు. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల ముఖం, చేతులపై కాలిన గాయాలయ్యాయని, వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ వినోద్ మిశ్రా చెప్పారు. బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆస్పత్రిని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. బెలూన్‌కు సమీపంలో టపాకాయను కాల్చడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నట్టు భువనేశ్వర్ పోలీస్ కమిషనర్ ఆర్పీ శర్మ చెప్పారు. -
ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చేసిన సీఎం
రాజకీయాల్లోకి వస్తే.. ఆస్తులు కూడగట్టుకోవాలని చూసే ఈ రోజుల్లో, తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తి కూడా తనకు వద్దని చెప్పే ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా? ఉన్నారు.. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ త్యాగం చేశారు. తన తండ్రి బిజూ పట్నాయక్ వారసత్వంగా ఇచ్చిన 10 కోట్ల రూపాయల ఆస్తులను ఆయన ప్రభుత్వానికి రాసిచ్చేశారు. కటక్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన ఈ ఆస్తులను ప్రభుత్వం పేరుమీద రిజిస్ట్రేషన్ చేసేశారు. ఎప్పుడూ తెల్లటి లాల్చీ, పైజమా మాత్రమే ధరించి ఉండే నవీన్ పట్నాయక్.. ఇప్పుడు మరింత నిరాడంబరత ప్రదర్శించి, తండ్రి ఆస్తులను కూడా ప్రభుత్వానికి ఇచ్చేశారు. 1997లో తన తండ్రి మరణించిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి పేరుమీద బిజూ జనతాదళ్ అనే పార్టీని స్థాపించారు. -
సీఎంగా ప్రమాణం చేసిన నవీన్
-
సీఎంలుగా ప్రమాణం చేసిన నవీన్, పవన్
ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ వరుసగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ ఎస్.సి.జమీర్ బుధవారం రాజ్‌భవన్‌లో నవీన్ పట్నాయిక్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 21 మంది ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణం చేయించారు. 10 మంది కేబినెట్ మంత్రులు కాగా, 11 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అత్యంత సాదాసీదాగా జరిగిన ఆ వేడుకలకు వందలాది మంది బీజేడీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పాత్రికేయులు హాజరైయ్యారు. అలాగే సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా ఐదవ సారి పవన్ కుమార్ చామ్లీంగ్ ప్రమాణ స్వీకారం చేశారు. సిక్కిం రాజధాని గంగ్టక్లోని రాజభవన్ ఆశీర్వాద్ హాల్లో ఆ రాష్ట్ర గవర్నర్... చామ్లీంగ్ చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కార్యక్రమానికి సిక్కింగ్ డెమెక్రటిక్ ఫ్రెంట్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు.