సీఎంలుగా ప్రమాణం చేసిన నవీన్, పవన్ | Naveen Patnaik sworn in as Odisha chief minister | Sakshi
Sakshi News home page

సీఎంలుగా ప్రమాణం చేసిన నవీన్, పవన్

Published Wed, May 21 2014 12:22 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

సీఎంలుగా ప్రమాణం చేసిన నవీన్, పవన్

సీఎంలుగా ప్రమాణం చేసిన నవీన్, పవన్

ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ వరుసగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఆ రాష్ట్ర గవర్నర్ ఎస్.సి.జమీర్ బుధవారం రాజ్భవన్లో నవీన్ పట్నాయిక్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 21 మంది ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణం చేయించారు. 10 మంది కేబినెట్ మంత్రులు కాగా, 11 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అత్యంత సాదాసీదాగా జరిగిన ఆ వేడుకలకు వందలాది మంది బీజేడీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పాత్రికేయులు హాజరైయ్యారు.

 

అలాగే సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా ఐదవ సారి పవన్ కుమార్ చామ్లీంగ్ ప్రమాణ స్వీకారం చేశారు. సిక్కిం రాజధాని గంగ్టక్లోని రాజభవన్ ఆశీర్వాద్ హాల్లో ఆ రాష్ట్ర గవర్నర్... చామ్లీంగ్ చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కార్యక్రమానికి సిక్కింగ్ డెమెక్రటిక్ ఫ్రెంట్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement