ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చేసిన సీఎం | odisha cm gives away ancestral property to government | Sakshi
Sakshi News home page

ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చేసిన సీఎం

Published Tue, Jan 13 2015 4:30 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చేసిన సీఎం

ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చేసిన సీఎం

రాజకీయాల్లోకి వస్తే.. ఆస్తులు కూడగట్టుకోవాలని చూసే ఈ రోజుల్లో, తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తి కూడా తనకు వద్దని చెప్పే ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా? ఉన్నారు.. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ త్యాగం చేశారు.

తన తండ్రి బిజూ పట్నాయక్ వారసత్వంగా ఇచ్చిన 10 కోట్ల రూపాయల ఆస్తులను ఆయన ప్రభుత్వానికి రాసిచ్చేశారు. కటక్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన ఈ ఆస్తులను ప్రభుత్వం పేరుమీద రిజిస్ట్రేషన్ చేసేశారు. ఎప్పుడూ తెల్లటి లాల్చీ, పైజమా మాత్రమే ధరించి ఉండే నవీన్ పట్నాయక్.. ఇప్పుడు మరింత నిరాడంబరత ప్రదర్శించి, తండ్రి ఆస్తులను కూడా ప్రభుత్వానికి ఇచ్చేశారు. 1997లో తన తండ్రి మరణించిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి పేరుమీద బిజూ జనతాదళ్ అనే పార్టీని స్థాపించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement