ancestral property
-
ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్.. సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం పదవి ఎవరికి దక్కుతుందా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయంపైనే అధిష్టానంతో చర్చలు జరిపేందుకు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఢిల్లీ చేరుకున్నారు. హైకమాండ్ పిలుపు మేరకు హస్తిన వెళ్లారు. సిద్ధరామయ్య, డీకేలు సీఎం పదవి చెరో రెండేళ్లు చేపట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిపాదించిందని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై స్పందిస్తూ డీకే కీలకవ్యాఖ్యలు చేశారు. ఇద్దరు పంచుకోవడానికి సీఎం పదవి ఏమీ వారసత్వ ఆస్తి కాదని పేర్కొన్నారు. అసలు ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదనేమీ తమ ముందుకు రాలేదని చెప్పారు. అలాగే సిద్ధరామయ్యకు 80 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, దీంతో ఆయనకే అవకాశం లభిస్తుందని జరుగుతున్న ప్రచారంపైనా డీకే స్పందించారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 135 అని, దీన్ని ఎవరు విడగొట్టలేరని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల మద్దతు గురించి అసలు అంత కచ్చితంగా సంఖ్య ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ సమయంలో డీకే పక్కనే ఉన్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఎమ్మెల్యేల మద్దతుపై ఇంకా కౌంటింగ్ జరాగాల్సి ఉందని జోకులు పేల్చారు. మరోవైపు కర్ణాటక సీఎం ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ మంగళవారం ఉదయం బేటీ అయ్యారు. ఢిల్లీ చేరుకున్న డీకేతోనూ కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు జరపనుంది. ఇద్దరిని బుజ్జగించి సాయంత్రం వరకు సీఎం ఎవరనే విషయాన్ని తేల్చే అవకాశం ఉంది. కాగా.. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని డీకే అంతకుముందే స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేలను విడగొట్టనని, వెన్నుపొటు పొడవనని స్పష్టం చేశారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడబోనని తేల్చిచెప్పారు. చరిత్రలో తన గురించి తప్పుగా ఉండాలని కోరుకోవడం లేదని, చెడ్డపేరుతో వెళ్లాలనుకోట్లేదని చెప్పుకొచ్చారు. దీంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. తిరుగుబాటు ఉండదనే సంకేతాలు ఇచ్చారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌కు 20 సీట్లు తేవడమే తమ ముందున్న తదుపరి సవాల్ అని డీకే తెలిపారు. చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమర్ కీలక వ్యాఖ్యలు.. -
Keerthy suresh: ఇదో అద్భుతమైన అనుభవం
మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న యువ నటి కీర్తి సురేష్. అలా ఆదిలోనే నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత గ్లామర్ పాత్రలపై దృష్టి సారించింది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్‌కు ప్రస్తుతం క్రేజ్ తగ్గిందనే మాట వినిపిస్తోంది. అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటిస్తున్న మా మనిదన్ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం జయం రవి సరసన సైరన్ అనే చిత్రం మాత్రమే చేతిలో ఉంది. కెరీర్ పరంగా ఆమె పరిస్థితి ఇలా ఉంటే వ్యక్తి గతంగా మాత్రం కీర్తి సురేష్ బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల ఈ తరం నటీమణులు పేరుతో పార్టీని నిర్వహించి ఆటా, పాట, విందు, వినోదాలతో సందడి చేసింది. ఇప్పుడు తన పూర్వీకుల గ్రామానికి వెళ్లి వార్తల్లో నిలిచింది. చదవండి: (Mani Shankar: రిలీజ్‌కు రెడీ అవుతున్న సంజనా గల్రానీ 'మణిశంకర్') కీర్తి సురేష్ తండ్రి సురేష్ మలయాళీ కాగా ఆమె తల్లి నటి మేనక తమిళం అన్నది తెలిసిందే. ఈమె ఇప్పటికీ తిరునెల్వేలి జిల్లా తిరుక్కట్రంకుడి గ్రామంలో నివసిస్తున్నారు. దీంతో నటి కీర్తి సురేష్ ఇటీవల అనూహ్యంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ గ్రామానికి వెళ్లింది. అక్కడ తన పూర్వీకుల ఇంటిని సందర్శించి, ఆ ఇంట్లో నేలపై కూర్చుని బంధువులతో ముచ్చటించింది. అనంతరం ఆ ప్రాంతంలో 8వ దశాబ్ధంలో కట్టిన నంబిపెరుమాళ్ ప్రాచీన దేవాలయాన్ని సందర్శించి, విశేష పూజలను చేసింది. అక్కడ దిగిన ఫొటోలను తన ఇన్ స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి 8వ శతాబ్ధంలో నిర్మించిన ప్రాచీన దేవాలయాన్ని సందర్శించడం అద్భుతమైన అనుభవం అని పేర్కొంది. ఆ ఆలయ శిల్పకళలను చూసి ఎంతో తన్మయత్వం చెందానని, మనసుకు చాలా ప్రశాంతత కలిగిందని, ఇదో అనిర్వచనీయమైన అనుభూతి అని పేర్కొంది. -
గోవాలో బ్రిటన్ హోం సెక్రటరీ తండ్రికి ఉన్న ఆస్తి కబ్జా... విచారణకు ఆదేశం
పనాజీ: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ పగ్గాలు చేపట్టిన వెంటనే భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ని హోం సెక్రటరీగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బ్రిటన్ హోం సెక్రటరీ బ్రేవర్మన్ తండ్రి క్రిస్టీ ఫెర్నాండజ్కి గోవాలోని అస్సాగోలో సుమారు 13, 900 చ.కిమీ పూర్వీకులు ఆస్తి ఉంది. ఆ ఆస్తి కబ్జాకి గురయ్యిందని బ్రేవర్మన్ తండ్రి క్రిస్టీ ఫెర్నాండెజ్ ఫిర్యాదు చేసినట్లు గోవా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(సిట్) అధికారి నిధి వాసన్ తెలిపారు. ఫెర్నాండజ్ ఫిర్యాదు ఆధారంగా తాము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. ఫెర్నాండెజ్‌కు అతని కుటుంబసభ్యులకు చెందిన అస్సగావో గ్రామంలో సర్వే నెంబర్ 253/3, 252/3లో ఉన్న ఆస్తులను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఇన్వెంటరీ ప్రోసీడింగ్లను దాఖలు చేశారని ఫిర్యాదు చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆయా వ్యక్తుల ఈ ఏడాది జులై 27న ఆ ప్రోసీడింగ్లను దాఖలు చేసినట్లు ఆగస్టులో తనకు తెలిసిందని ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయాన్ని ఈమెయిల్ ద్వారా ఫెర్నాండజ్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జస్పాల్ సింగ్ గోవా ఎన్నారై కమిషనరేట్లకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గోవా ఎన్నారై కమీషనర్ నరేంద్ర సవైకర్ మాట్లాడుతూ... తమ శాఖకు గతవారమే ఈమెయిల్ వచ్చిందని, దీన్ని రాష్ట్ర హోం శాఖకు పంపించామని తెలిపారు. ఈ మేరకు గోవా ప్రభుత్వం ఇలాంటి భూ కబ్జా కేసులను నివారించేందుకు ఈ ఏడాది ప్రారంభంలో పోలీస్, రెవెన్యూ, ఆర్కెవ్స్, పురావస్తు శాఖ అధికారులతో కూడిన సిట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ రాష్ట్రంలో ఇలాంటి భూ కబ్జా కేసులకు సంబంధించి సుమారు 100కు పైగా కేసులను దర్యాప్తు చేస్తోంది. (చదవండి: గేమింగ్ యాప్ స్కామ్.... సుమారు రూ. 7 కోట్లు స్వాధీనం) -
దావూద్ పూర్వీకుల ఆస్తులు వేలం
ముంబై: భారత్‌తో సహా ప్రపంచంలోని అనేకదేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడిన అండర్ వరల్డ్ డాన్, అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను వేలం వేయనున్నారు. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్(ఎస్ఏఎఫ్ఎంఏ) కింద ఈ వేలం ప్రక్రియ జరగనుంది. మహరాష్ట్రలోని రత్నగిరి జిల్లా కొంకణ్‌లో దావూద్ పూర్వీకులకు చెందిన స్థిరాస్థులు ఉన్నాయి. వీటిని నవంబర్ 10న వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో వేలం ప్రక్రియను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా,ఆస్తుల వేల్యువేషన్ ప్రక్రియ గతేడాదే ముగిసిన విషయం తెలిసిందే. రత్నగిరి జిల్లా ఖేడ్ తాలుకాలోని ముంబ్కే గ్రామంలో దావూద్ పూర్వీకులు నివాసముండేవారు. ఈ గ్రామంతో పాటు అనేక ప్రాంతాల్లో దావూద్‌కు స్థిరాస్తులు ఉన్నాయి. (చదవండి: మాతోశ్రీని పేల్చేస్తాం) 1980లలో ఇక్కడ ఉన్న బంగ్లాలోనే దావూద్ కుటుంబ సభ్యులు నివాసముండేవారు. దీనిని దావూద్ ఎంతో విలాసవంతంగా తీర్చిదిద్ది తన తల్లి పేరు మీద రాయించాడు. 1993 ముంబయి పేలుళ్ల అనంతరం దావుద్ కుటుంబసభ్యులు దీనిని విడిచిపెట్టారు. అప్పటి నుంచి బంగ్లా ఖాళీగానే ఉంది. కానీ ఇప్పుడు ఇది శిథిలావస్థకు చేరింది. ఏ నిమిషంలోనైనా కూలిపోయే పరిస్థితికి నెలకొంది. తాజాగా ఆదివారం ముంబ్కే గ్రామంలో పర్యటించిన అధికారులు.. దావూద్ ఆస్తులపై సర్వే నిర్వహించారు. మొత్తం 7 ఆస్తులను వేలం వేయడానికి సన్నద్ధమవుతున్నారు. వీటి విలువ కోటి రూపాయలు ఉండనున్నట్లు తెలిసింది. కాగా, 1993 ముంబై వరస పేలుళ్లు తర్వాత దేశాన్ని వదిలిపెట్టి పాకిస్తాన్ పారిపోయాడు దావూద్. అలాగే దావూద్ సహచరుడు, గ్యాంగ్ స్టర్ ఇక్బల్ మిర్చికి చెందిన రెండు ఫ్లాట్లను కూడా అదే రోజున వేలం వేస్తారు. వచ్ఛే నెల 2 న బిడ్డర్ల పరిశీలన జరుగుతుంది. -
బాలీవుడ్ నటుల ఇళ్లు కొంటాం: పాక్
ఇస్లామాబాద్: బాలీవుడ్ నటులు రాజ్ కపూర్, దిలీప్ కుమార్ల పూర్వీకుల ఇళ్లను కొనుగోలు చేయాలని పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇవి శిథిలావస్థలో ఉన్నాయి. చారిత్రక ప్రాధాన్యం గల వీటిని కూల్చివేయకుండా.. నేషనల్ హెరిటేజ్‌గా గుర్తించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా పురావస్తు శాఖ ఈ రెండు భవనాలను కొనుగోలు చేయడానికి తగిన నిధులు కేటాయించాలని నిర్ణయించింది. ఈ భవనాలు పెషావర్ నగరం నడిబొడ్డున ఉన్నాయి. వీటి ధరను నిర్ణయించడానికి పెషావర్ డిప్యూటీ కమిషనర్‌కు ఒక లేఖ పంపారు. రాజ్ కపూర్ పూర్వీకుల నివాసాన్ని కపూర్ హవేలీ అని పిలుస్తారు. ఇది కిస్సా ఖ్వానీ బజార్లో ఉంది. దీనిని 1918-22 మధ్య కాలంలో దిగ్గజ నటుడి తాత దేవాన్ బాషేశ్వర్నాథ్ కపూర్ నిర్మించారు. రాజ్ కపూర్, అలానే అతని మామ త్రిలోక్ కపూర్ ఈ భవనంలో జన్మించారు. దీనిని ప్రాంతీయ ప్రభుత్వం జాతీయ వారసత్వంగా ప్రకటించింది.(చదవండి: గిల్గిత్ బాల్టిస్తాన్‌పై పాక్ పన్నాగం) ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ 100 సంవత్సరాల పురాతన పూర్వీకుల ఇల్లు కూడా అదే ప్రాంతంలో ఉంది. ఈ ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది. 2014 లో అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం దీనిని జాతీయ వారసత్వంగా ప్రకటించింది. రెండు భవనాల యజమానులు గతంలో వీటిని పడగొట్టి కమర్షియల్ ప్లాజాలను నిర్మించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని వాటిని సంరక్షించాలని పురావస్తు శాఖ భావించింది. దాంతో అలాంటి ప్రయత్నాలు ఆగిపోయాయి. అయితే, కపూర్ హవేలీ యజమాని అలీ ఖాదర్ మాట్లాడుతూ.. ఈ భవనాన్ని కూల్చివేయడానికి తాను ఇష్టపడనని, దేశ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఈ చారిత్రాత్మక నిర్మాణాన్ని పరిరక్షించాలని పురావస్తు శాఖ అధికారులతో అనేక సార్లు విన్నవించానని తెలిపారు. దీన్ని ప్రభుత్వానికి అమ్మేందుకు యజమాని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రభుత్వం నుంచి 200 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం.(చదవండి: బాలీవుడ్ నటుడి ఇంట మరో విషాదం) ఈ ఏడాది ముంబైలో మరణించిన రిషి కపూర్ చేసిన అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని కపూర్ హవేలీని మ్యూజియంగా మార్చాలని 2018 లో పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. రెండు సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ఈ ప్రకటన ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇవేకాక పెషావర్‌లో సుమారు 1,800 చారిత్రాత్మక నిర్మాణాలు ఉన్నాయి. ఇవన్ని 300 సంవత్సరాలకు పూర్వం నాటివి. -
ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చేసిన సీఎం
రాజకీయాల్లోకి వస్తే.. ఆస్తులు కూడగట్టుకోవాలని చూసే ఈ రోజుల్లో, తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తి కూడా తనకు వద్దని చెప్పే ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా? ఉన్నారు.. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ త్యాగం చేశారు. తన తండ్రి బిజూ పట్నాయక్ వారసత్వంగా ఇచ్చిన 10 కోట్ల రూపాయల ఆస్తులను ఆయన ప్రభుత్వానికి రాసిచ్చేశారు. కటక్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన ఈ ఆస్తులను ప్రభుత్వం పేరుమీద రిజిస్ట్రేషన్ చేసేశారు. ఎప్పుడూ తెల్లటి లాల్చీ, పైజమా మాత్రమే ధరించి ఉండే నవీన్ పట్నాయక్.. ఇప్పుడు మరింత నిరాడంబరత ప్రదర్శించి, తండ్రి ఆస్తులను కూడా ప్రభుత్వానికి ఇచ్చేశారు. 1997లో తన తండ్రి మరణించిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి పేరుమీద బిజూ జనతాదళ్ అనే పార్టీని స్థాపించారు.