భువనేశ్వర్: ఒడిశాలోని ఐదు జిల్లాలను లాక్‌డౌన్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఖుర్దా, కటక్, గంజాం, కేంద్రపారా, అంగుల్ జిల్లాల్లో లాక్‌డౌన్ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రేపటి నుంచి మార్చి 29వ తేదీ వరకు ఐదు జిల్లాలోని లాక్‌డౌన్ ఉంటుందన్నారు. చదవండి: జనతా కర్ఫ్యూ: పెట్రోల్ బంక్‌లు బంద్
ఇప్పటికే పూరీ, రూర్కేలా, సంబల్‌పూర్, జార్షూగూడ, బాలాసోర్, జాజ్‌పూర్ రోడ్, జాజ్‌పూర్ టౌన్, భద్రక్ పట్టణాల్లో ఒడిశా ప్రభుత్వం లాక్‌డౌన్ చేసింది. అత్యవరస సేవలకు లాక్‌డౌన్ నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. వారం క్రితమే రాష్ట్ర రాజధాని భువనేశ్వర్, కటక్ వంటి పారిశ్రామిక పట్టణాలు మూతపడ్డాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో దాదాపు 40శాతం మూతపడినట్లయింది. చదవండి: ‘ఇంట్లోనే ఉన్నా.. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు’
Comments
Please login to add a commentAdd a comment