
సాక్షి, అమరావతి: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ‘‘సాదరంగా ఆహ్వానించి, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపినందుకు సంతోషంగా ఉంది. త్వరలో ఈ చర్చలు సత్ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తున్నాను’’ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
చదవండి: AP-Odisha: సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ
కాగా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మంగళవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఒడిశా సచివాలయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. మూడు అంశాలపై ఒడిశా సీఎంతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ వేయాలని నిర్ణయించారు.
చదవండి: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
ఒడిషా ముఖ్యమంత్రి శ్రీ @Naveen_Odisha గారికి ధన్యవాదాలు. సాదరంగా ఆహ్వానించి, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపినందుకు సంతోషంగా ఉంది. త్వరలో ఈ చర్చలు సత్ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తున్నాను. pic.twitter.com/xb8ICX1LfT
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 9, 2021