భువనేశ్వర్: సార్వత్రిక ఎన్నికల్లో దిగ్భ్రాంతికరమైన పరాజయం తర్వాత ఒడిశాలో బుధవారం ఓ శకం ముగిసింది. 24 ఏళ్ల 89 రోజులు ముఖ్యమంత్రి పాలనకు తెరపడింది. ఈ ఓటమి భారత దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ కలలను తుడిచివేయడంతో బిజూ జనతా దళ్ భవిష్యత్తును అగమ్య గోచరం చేసింది. ఆయన నేతృత్వంలో ఐదు పర్యాయాలలో బీజేడీ ప్రభుత్వం ప్రజలను ముందంజలో ఉంచి ఉన్నత రాజకీయాల శకం ఆవిష్కరణకు నాంది పలికింది. పేదల కోసం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు నవీన్ పాలనలో మైలురాళ్లుగా మిగిలిపోయాయి.
సగటు మనిషిని సాధికార బాటలో నడిపించే మార్గదర్శిగా ఆయన మిగిలిపోయారు. రూ.1కే కిలో బియ్యం వంటి సాధారణ సంక్షేమ పథకంతో అన్ని వర్గాల రైతాంగం సంక్షేమానికి బహుదూర దృష్టితో రైతుల కోసం కాలియా (కృషక్ సహాయం జీవనోపాధి మరియు ఆదాయ వృద్ధి) పథకం, అందరికీ ఆరోగ్యం నినాదంతో బిజు స్వాస్థ్య కళ్యాణ్ యోజన (బీఎస్‌కేవై), లక్మీ బస్ సరీ్వస్, రాష్ట్ర వ్యాప్తంగా అత్యున్నత స్థాయి రహదారుల నిర్మాణం వంటి కార్యకలాపాలతో మిషన్ శక్తి సంకల్పంతో మహిళల ఆర్థిక, రాజకీయ సాధికారత, రాష్ట్రంలో ఏడు మిలియన్ల మంది మహిళలను ఒక తాటిపై నడిపించేందుకు ముందంజ వేసిన మహిళా స్వయం సహాయక బృందాలు అద్భుతమైన విజయ సోపానంగా నిలిచిపోతుంది.
మిత భాషి.. కార్య సాధకుడు
రాజకీయాల్లో అవగాహన అనేది కీలకమని ప్రబోధించిన తత్వవేత్త. అత్యంత మిత భాషి. నిశ్చలమైన దృక్పథంతో నిర్ధారిత కాల పరిమితిలో వాస్తవ కార్యాచరణ దక్షత చాటుకున్న అరుదైన నాయకుడు. దైనందిన పాలనలో వాస్తవాలు, రోజువారీ అనుభవం ఆధారంగా ప్రజల్లో ఒకడిగా కదిలాడే వ్యక్తిగా సమయోచిత కార్యాచరణతో సత్వర ప్రయోజనాలు అక్కరకు తీసుకువచ్చి దాదాపు రెండున్నర దశాబ్దాలు సుదీర్ఘ ప్రజా పాలన అందజేసి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పదిలపరచుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజా విధానాలు ప్రజల సామర్థ్యాలను పెంపొందించడానికి, వారి చట్టబద్ధమైన హక్కులతో సాధికారిత కలి్పంచే రూపకల్పన నవీన్ పట్నాయక్ పాలనలో సుస్పష్టంగా తారసపడుతుంది. ఈ దిశలో మహిళా సాధికారతకు ఆయన చేపట్టిన సంస్కరణలు వెలకట్టలేనివి. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మహిళకు కనీసం మూడింట ఒక వంతు ప్రాతినిథ్యం కలి్పంచడం అనివార్యంగా శాసించారు. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో 50 శాతం, భారత పార్లమెంటుకు మూడింట ఒక వంతు మహిళలకు ప్రాతినిథ్యం కల్పించిన ఉన్నత శ్రేణి నాయకుడు నవీన్. ఈ దృక్పథం జాతీయ స్థాయిలో పలు రాజకీయ పక్షాలు, ప్రముఖ నాయకుల్ని చలింపజేసింది.
అహింస నినాదం..
అహింసావాదంతో జాతికి వన్నె తెచ్చిన జాతిపిత మహాత్మ గాంధీ నినాదం భారత రాజ్యాంగంలో నిర్వచనంగా చోటు చేసుకోవాలని సంకల్పించిన ఏకైక నాయకుడుగా నిలిచారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికలో అహింసను చేర్చాలని, అలా చేయడం ద్వారా దేశం మహాత్మా గాం«దీకి నిజమైన నివాళులరి్పంచినట్లు అవుతుందని పేర్కొన్నారు.
విపత్తుపై విజేత..
ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడమే కాకుండా తుపాను, వరదలు, కరువు కాటకాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, రైలు దుర్ఘటనలు వంటి మానవ కృత్యాల వైఫల్యాలతో అకస్మాతుగా తలెత్తే ఆకస్మిక విపత్తుల్ని అవలీలగా నిర్వహించి కనురెప్ప పాటులో పునరుద్ధరణ, పునరి్నర్మాణ కార్యకలాపాలతో బతుకుపై ఆశ కోల్పోయిన బాధిత వర్గానికి ఆపద్బాంధవుడుగా నిలిచారు. విపత్తు నిర్వహణలో రాష్ట్రం యునెస్కో వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు గుర్తించి ప్రశంసించడం విశేషం. శూన్య ప్రాణ హాని నినాదం విపత్తు నిర్వహణ మూలమంత్రంగా అనుబంధ యంత్రాంగం అలవరచుకోగలిగింది.
గెలుపు కష్టం కాదు..
ఎన్నికలలో గెలవడం కంటే ప్రజలకు సమర్ధవంతమైన పాలన అందజేయడం అత్యంత క్లిష్టం. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి రాష్ట్ర యంత్రాంగాన్ని సమయ స్ఫూర్తితో స్పందింప జేయడం సమర్థవంతమైన పాలనకు నిదర్శనం. కష్టాల కన్నీళ్లుతో తడిచిన ఒడిశా ఆధునిక భారతదేశం పురోగతికి మార్గదర్శి కావాలనే ఆయన దృఢ సంకల్పం అనిర్వచనీయం. 1999 నాటి పెను తుపాను (సూపర్ సైక్లోన్) పొరుగు రాష్ట్రం దయదాక్షిణ్యాలతో మేలుకుని దాదాపు నెల రోజుల తర్వాత రాష్ట్రం వెలుగు చూసింది. ఈ చేదు అనుభవంతో చలించిన ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ నేడు విపత్తు నిర్వహణలో ప్రపంచ దిక్సూచిగా రాష్ట్రం వెలుగొందుతుంది.
ప్రజలకు చేరువ..
పాలన పగ్గాలు చేపట్టేందుకు కాదు ఎన్నికలలో విజయం.. మార్పు, పరివర్తన దృక్పథంతో పాలన చేపడితే ప్రజలకు చేరువై నిజమైన ప్రజాస్వామ్య పాలకులుగా చరిత్రలో మిగిలిపోయే నాయకులు అవుతారని ఆదర్శ ముఖ్యమంత్రి అవార్డు అందుకున్న సందర్భంగా జాతికి పిలుపునిచ్చారు. ఈ కోవకు చెందిన వారిలో జాతిపిత మహాత్మా గాం«దీ, దివంగత ముఖ్యమంత్రి బిజూ పటా్నయక్ వంటి మహా నాయకుల తరహాలో నిరంతరం ప్రజల గుండెల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు. ప్రజలను ముందంజలో ఉంచి కొనసాగించే పాలన రాజకీయ యాత్రగా కాకుండా ఆధ్యాతి్మక అనుభవంగా అద్భుత సంతృప్తిని మిగుల్చుతుందని వర్ధమాన నాయకుల్ని ఉద్దేశించి ప్రబోధించిన మహానేత నవీన్ పట్నాయక్ ప్రజా తీర్పుతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ని్రష్కమించారు.
Comments
Please login to add a commentAdd a comment