శ్రీకాకుళం, ఒడిశాలో సీఎం జగన్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే | AP CM YS Jagan Will Visit Srikakulam And Odisha On November 9th | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం, ఒడిశాలో సీఎం జగన్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

Published Mon, Nov 8 2021 5:22 PM | Last Updated on Mon, Nov 8 2021 7:28 PM

AP CM YS Jagan Will Visit Srikakulam And Odisha On November 9th - Sakshi

సాక్షి, అమరావతి: శ్రీకాకుళం, ఒడిశాలో రేపు(మంగళవారం) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 01.15 గంటలకు పాతపట్నం చేరుకుని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.

చదవండి: ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్‌ సమీక్ష

శ్రీకాకుళం పర్యటన అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భువనేశ్వర్‌ బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నివాసంలో రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్‌ అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9 గంటలకు తాడేపల్లి నివాసం చేరుకోనున్నారు.

చదవండి: బీజేపీ నేతలు నీతులు చెప్పడం విడ్డూరం: పేర్ని నాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement