
సాక్షి, తాడేపల్లి : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లేఖ రాశారు. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వం సహకారం కోరుతూ ముఖ్యమంత్రి ఈ లేఖ రాశారు. నేరడి బ్యారేజీ నిర్మాణ విషయంలో ఒడిశాతో సంప్రదింపులకు తాము సిద్ధమని లేఖలో పేర్కొన్నారు.
దీనికి సంబంధించి చర్చించేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సహాయం కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణంతో ఒడిశా రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. దీనివల్ల ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రైతులకు, ఒడిశాలోని గణపతి జిల్లా రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని లేఖలో తెలిపారు. సముద్రంలోకి వృథాగా పోయే 80 టీఎమ్‌సీల నీటిని నేరడి బ్యారేజ్ నిర్మాణం ద్వారా వినియోగంలోకి తీసుకురావచ్చన్నారు.
చదవండి: వ్యాక్సినే అస్త్రం.. ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment