భువనేశ్వర్ : కరోనా కారణంగా మృతిచెందిన జర్నలిస్ట్ కుటుంబానికి 15 లక్షల రూపాయాల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ప్రాణంతక కరోనా మహమ్మరిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జర్నలిస్టులు పోషిస్తున్న బాధ్యత అనిర్వచనీయం అని పేర్కొన్నారు. విధినిర్వహణలో ఏ జర్నలిస్ట్ అయినా వైరస్ భారిన పడి చనిపోతే ఆయా కుటుంబాలకు 15 లక్షల రూపాయాల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. ఈ కష్టకాలంలో తమ ప్రాణాలనే పణంగా పెట్టి ప్రజలకు అవగామన కల్పిస్తున్నారని ట్వీట్ చేశారు.
CM @Naveen_Odisha has announced ₹ 15 lakh compassionate assistance to families of working journalists who may lose life to #COVID19 infection. CM said journalists are dedicatedly working to raise awareness about the pandemic during this difficult times. #OdishaCares
— CMO Odisha (@CMO_Odisha) April 27, 2020
కోవిడ్-19 మహమ్మరి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లు కరోనా కారణంగా మరణిస్తే వారి కుటుంబానికి చేయూత అందించేందుకు 50 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ఇదివరకే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ వైద్య సిబ్బందిని అమర వీరులుగా పరిగణించి ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుందని పేర్కొంది.
(కరోనా: ఆరోగ్య సిబ్బంది మరణిస్తే రూ.50 లక్షలు)
Comments
Please login to add a commentAdd a comment