
భువనేశ్వర్: ఏ పార్టీతోనూ తమకు పొత్తు లేదని, ఏ కూటమిలోనూ తాము భాగస్వామి కాదని ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, దీనిపై తమ అధినేత నవీన్ పట్నాయక్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని తెలియజేశారు. అన్ని పార్టీలతో సమదూరం పాటిస్తున్నామని వివరించారు.
ఒడిశా రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధే తమ ప్రధాన అజెండా అని వెల్లడించారు. నవీన్ పట్నాయక్ మిత్రుడైన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రతిపాదిస్తున్న థర్డ్ ఫ్రంట్‌కు దూరంగా ఉంటామని అన్నారు. నవీన్ పట్నాయక్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. థర్డ్ ఫ్రంట్‌లో తమ పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేశారు. నవీన్ పట్నాయక్ అంతకుముందు నితీశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. వారు ఏం మాట్లాడుకున్నారన్నది తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment