Biju Janata Dal (BJD)
-
Lok Sabha Election Results 2024: నవీన్ పట్నాయక్ రాజీనామా
భువనేశ్వర్: ఒడిశాలో బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ పరిపాలనకు తెరపడింది. 24 ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన నవీన్ పటా్నయక్ బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ రఘువర్ దాస్‌కు సమరి్పంచారు. ఒడిశా శాసనసభ ఎన్నికల్లో బీజేడీ పరాజయం పాలైంది. 147 స్థానాలకు గాను కేవలం 51 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ ఏకంగా 78 సీట్లు సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. నవీన్ పట్నాయక్ 2000 సంవత్సరం మార్చి 5న తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి పదవిలో కొనసాగారు. తాజా ఎన్నికల్లో ఓటమి ఎదురుకావడంతో పదవి నుంచి తప్పుకున్నారు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నారు. -
Lok Sabha Election 2024: మహిళలకు బీజేడీ సముచిత స్థానం!
లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ (బీజేడీ) ఆదర్శంగా నిలిచింది. టికెట్ల కేటాయింపులో మహిళలకు సముచిత స్థానమిచ్చి గౌరవించింది. రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాలుంటే ఏడు చోట్ల మహిళలకు అవకాశం ఇచి్చంది. అంటే వారికి 33 శాతం సీట్లు కేటాయించింది. లేఖశ్రీ సమంత్ సింగార్ (బాలాసోర్), శర్మిష్ట సేథీ (జజ్పూర్), మంజులా మండల్ (భద్రక్), రాజశ్రీ మల్లిక్ (జగత్సింగ్పూర్), పరిణీతి మిశ్రా (బార్గఢ్), కౌసల్యా హికాక (కోరాపుట్), రంజితా సాహూ (ఆస్క)కు టికెట్లిచ్చింది. అదే సమయంలో టికెట్ల కేటాయింపులో ఫిరాయింపుదారులకు కూడా పెద్ద పీట వేసి విమర్శకుల నోళ్లకు పని చెప్పింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఏడుగురు మహిళలకు బీజేడీ చీఫ్, సీఎం నవీన్ పట్నాయక్ టికెట్లివ్వడం గమనార్హం. ఈసారి బీజేడీ నుంచి బరిలోకి దిగిన ఏడుగురు మహిళా అభ్యర్థుల్లో బీజేపీ నుంచి వచి్చన లేఖశ్రీ సమంత్ సింగార్ కూడా ఉన్నారు. ఆమె బాలాసోర్ నుంచి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఏడుగురు బీజేడీ మహిళా అభ్యర్థుల్లో ఇద్దరు పార్టీ ఫిరాయింపుదారులున్నారు! ఈ విడత ఇద్దరు సిట్టింగ్ మహిళా ఎంపీలు చంద్రాణి ముర్ము (కియోంజర్), ప్రమీలా బిసోయ్ (ఆస్క)లకు నవీన్ టికెట్లివ్వలేదు. ఫిరాయింపుదారులకూ 33 శాతం ఒకరిద్దరు కాదు.. బీజేడీ ఈ విడత ఏకంగా 38 శాతం మంది ఫిరాయింపుదారులను లోక్‌సభ బరిలో దింపడం ఆశ్చర్యకరం. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు ఇతర పారీ్టల నుంచి వచి్చచేరిన వారే! లేఖశ్రీ సమంత్ సింగార్ (బాలాసోర్), భృగు బాక్సిపాత్ర (బెర్హాంపూర్), ప్రదీప్ మాంఝి (నబరంగ్‌పూర్), సురేంద్ర సింగ్ భోయ్ (బోలంగీర్), పరిణీత మిశ్రా (బార్గఢ్), ధనర్జయ్ సిధు (కియోంఝర్), అన్షుమన్ మహంతి (కేంద్రపర), మన్మోత్ రూట్రే (భువనేశ్వర్) ఇతర పారీ్టల నుంచి వచ్చి బీజేడీ టికెట్ సంపాదించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: బీజేడీకి సవాల్!
ఒడిశాలో ఇప్పటిదాకా 9 లోక్‌సభ సీట్లకు, వాటి పరిధిలోని 63 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఆరో విడతలో 6 లోక్‌సభ సీట్లకు శనివారం పోలింగ్ జరగనుంది. అధికార బిజూ జనతాదళ్, బీజేపీ హోరాహోరీగా తలపడుతుండగా కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక నియోజకవర్గాలపై ఫోకస్... సంభాల్పూర్... తొలిసారి కాషాయ జెండా 2019లో ఇక్కడ తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ నేత నరేశ్ గంగదేవ్ కేవలం 9,162 ఓట్ల తేడాతో బీజేడీ అభ్యర్థి నళినీకాంత ప్రధాన్‌ను ఓడించారు. ఈసారి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి నాగేంద్ర ప్రధాన్, బీజేడీ నుంచి ప్రణబ్ ప్రకాశ్ దాస్ పోటీలో ఉన్నారు. త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది.కటక్... బీజేడీ కంచుకోటస్వాతంత్య్ర యోధుడు సుభాష్ చంద్ర బోస్ జన్మస్థలమిది, హొయలొలికించే మహానదీ తీరాన 900 ఏళ్లు కళింగ రాజధానిగా వెలిగింది. బీజేడీ దిగ్గజం భర్తృహరి మహతాబ్ 1998 నుంచి వరుసగా ఆరుసార్లు గెలిచారు. ఇటీవలే బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్‌పై బరిలోకి దిగారు. బీజేడీ నుంచి సంతృప్త్ మిశ్రా, కాంగ్రెస్ నుంచి సురేశ్ మహాపాత్ర రేసులో ఉన్నారు. కంచుకోటను కాపాడుకునేందుకు సీఎం నవీన్ పట్నాయక్ గట్టిగా ప్రయతి్నస్తున్నారు. కాంగ్రెస్‌కూ మంచి ఓటు బ్యాంకు ఉండటంతో త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది.పూరి.. నువ్వా నేనా! సుందరమైన బీచ్‌లు, జగన్నాథుడి సన్నిధితో కళకళలాడే పూరిలో బీజేడీకి 2019లో బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర చుక్కలు చూపించారు. చివరిదాకా గట్టి పోటీ ఇచ్చి కేవలం 11,714 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి మళ్లీ సవాలు విసురుతున్నారు. ఇక బీజేడీ సిట్టింగ్ ఎంపీ పినాకీ మిశ్రాకు బదులు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అరూప్ పట్నాయక్‌ను బరిలోకి దించింది. కాంగ్రెస్ నుంచి జయనారాయణ్ పటా్నయక్ పోటీలో ఉన్నారు. ఆ పారీ్టకి ఇక్కడ బలమైన ఓటు బ్యాంకుంది.భువనేశ్వర్... నవీన్‌కు సవాల్ ఈ టెంపుల్ సిటీలో గత ఎన్నికల్లో తొలిసారి బీజేపీ గెలిచింది. బీజేడీ అభ్యరి్థ, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అరూప్ పటా్నయక్ను బీజేపీ తరఫున మాజీ ఐఏఎస్ అపరాజితా సారంగి ఓడించారు. ఈసారీ ఆమే బరిలో ఉన్నారు. బీజేడీ నుంచి మన్మథ రౌత్రే, కాంగ్రెస్ నుంచి యాసిర్ నవాజ్ పోటీలో ఉన్నారు. దాంతో త్రిముఖ పోటీ రసవత్తరంగా మారింది. ఇండియా కూటమి భాగస్వామి సీపీఎం కూడా పోటీలో ఉండటం కొసమెరుపు!కియోంజర్.. పోటాపోటీ ఈ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం 2009 నుంచీ బీజేడీ గుప్పెట్లోనే ఉంది. 2019లో బీజేడీ నుంచి గెలిచిన చంద్రానీ ముర్ము యంగెస్ట్ ఎంపీగా రికార్డు సృష్టించారు. ఈసారి ధనుర్జయ సిద్దుకు బీజేడీ టికెటిచ్చింది. బీజేపీ నుంచి అనంత నాయక్, కాంగ్రెస్ నుంచి బినోద్ బిహారీ నాయక్ రేసులో ఉన్నారు. కియోంజర్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 బీజేడీ చేతిలోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
PM Narendra Modi: బీజేడీ సర్కార్.. జూన్ 4తో సమాప్తం
బరంపూర్/నబారంగ్పూర్: ఒడిశా శాస నసభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4వ తేదీన రాష్ట్రంలో బిజూజనతాదళ్ (బీజేడీ) ప్రభుత్వం అంతర్థానమవుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలయ్యాక మొదటి సారిగా ప్రధాని మోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేశారు. దేశంలోనే అగ్రరాష్ట్రంగా ఒడిశాను తీర్చిదిద్దే సదవకాశాన్ని బీజేపీకి ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. ఒరియా భాష, సంస్కృతులను అర్థంచేసుకునే ముఖ్యమంత్రే రాష్ట్రానికి అవసరమని బీజేడీ చీఫ్, సీఎం నవీన్ పట్నాయక్‌పై మోదీ విమ ర్శలు గుప్పించారు. పట్నాయక్‌కు ఒరియా భాషపై పట్టులేదని ఓ అపవాదు ఉంది. గిరిజనుల జనాభా ఎక్కువగా ఉండే నబా రంగ్‌పూర్, బరంపూర్లలో సోమవారం ఎన్నికల ర్యాలీల్లో మోదీ ప్రసంగించారు. ఎన్నికలయ్యాక డబుల్ ఇంజన్ సర్కార్‘‘మోదీ నాయకత్వంలో పదేళ్ల అభివృద్ధిని మీరు కళ్లారాచూశారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే మోదీ ప్రభుత్వం గిరిజనులకు కేటాయింపులను ఐదు రెట్లు పెంచింది. గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను 400కు పెంచాం. ఒక్క నా మంత్రిత్వశాఖలోనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉద్యోగులు 7 శాతం దాకా ఉన్నారు. బీజేడీ సర్కార్ కేంద్ర ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలుచేయని కారణంగా ఇక్కడి ప్రజలు ఆ పథక ప్రయోజనాలకు దూరమయ్యారు. జల్‌జీవన్ మిషన్ కింద ఒడిశాకు రూ.10,000 కోట్లు ఇచ్చాం. కానీ పట్నాయక్ సర్కార్ వాటిని సద్వినియోగం చేయలేదు’’ అని ఆరోపించారు.మాకు ఐదేళ్లు ఇవ్వండి‘‘ రాష్ట్రాన్ని పాలించే అవకాశాన్ని మీరు కాంగ్రెస్‌కు 50 ఏళ్లు ఇచ్చారు. బీజేడీకి 25 సంవత్సరాలు ఇచ్చారు. బీజేపీకి కేవలం ఐదు సంవత్సరాలు ఇచ్చి చూడండి. దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా ఒడిశాను తీర్చిదిద్ది చూపిస్తాం’’ అని అన్నారు. -
బీజేపీ, బీజేడీ పొత్తు!.. ప్రజల ప్రయోజనాలే లక్ష్యం: దేబి ప్రసాద్ మిశ్రా
లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజూ జనతా దళ్ (బీజేడీ) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మధ్య పొత్తు గురించి ఢిల్లీ, ఒడిశా రాజకీయ వర్గాల్లో భారీగా ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో.. బీజేడీ వైస్ ప్రెసిడెంట్ 'దేబి ప్రసాద్ మిశ్రా' పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని వ్యాఖ్యానించారు. ఒడిశా ప్రజల ప్రయోజనాలకు ఏది ఉపయోగపడుతుందో అది మా మార్గదర్శక సూత్రమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఇతర సీనియర్ బీజేడీ నాయకులు రాబోయే ఎన్నికలపై చర్చించడానికి త్వరలోనే సమావేశమవుతారని, ఇందులో ఒడిశా అభివృద్ధికి కావలసిన నిర్ణయాలు తీసుకుంటారని మిశ్రా వ్యాఖ్యానించారు. బీజేపీ, బీజేడీ మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. సీట్ల పంపకాలపైన తాత్కాలిక ఒప్పందం జరిగిందని, ఈ విషయం మీద త్వరలోనే అధికారికి ప్రకటన వెలువడుతుందని సమాచారం. బీజేపీ, బీజేడీ నాయకుల సమావేశం ఓ ముఖ్యమైన పరిణామాన్ని సూచిస్తోందని.. ఎన్డీఏ నుంచి విడిపోయిన 15 సంవత్సరాల తరువాత మళ్ళీ బీజేడీ కూటమిలో కలవనున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. 2009లో సీట్ల పంపకాల మీద కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ.. ఇకపైన రెండు పార్టీలకు అనుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. -
బీజేపీ-బీజేడీ: 15ఏళ్ల తర్వాత సరికొత్త పాలిటిక్స్!
దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ విజయానికి అనుకూల పరిస్థితులున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో చేరేందుకు పలు పార్టీలు ఆసక్తిచూపుతున్నాయి. ఈ క్రమంలో ఎన్డీయేలోకి బీజేడీ(బిజూ జనతా దళ్ పార్టీ) చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ, బీజేడీ మధ్య సంప్రదింపులు కూడా జరగడం విశేషం. కాగా, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీ.. బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతోందా?.. దాదాపు 15 ఏళ్ల తర్వాత తిరిగి ఎన్డీయేతో చేతులు కలపబోతోందా? అంటే నిజమేనని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఎన్డీయేలో చేరిక, బీజేపీతో పొత్తుపై తాజాగా సీఎం నవీన్ పట్నాయక్ అధికారిక నివాసం ‘నవీన్ నివాస్’ బీజేడీ నేతల విస్తృతమైన సమావేశం జరిగింది. ►ఇక, ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఢిల్లీలో పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్‌తో పాటు కీలక నేతలు ఢిల్లీలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాలు, బీజేడీతో పొత్తు అవకాశాలపై చర్చించారు. ►మరోవైపు.. బీజేడీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే దేబి ప్రసాద్ మిశ్రా పొత్తుపై చర్చించినట్టు మీడియాకు తెలిపారు. కానీ, ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే, తాము ఏ నిర్ణయం తీసుకున్నా.. ఒడిషా ప్రజల ప్రయోజనం కోసమేనని చెప్పుకొచ్చారు. ►ఇదిలా ఉండగా.. బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ జుయల్ ఓరం మాట్లాడుతూ.. బీజేడీతో పొత్తుపై ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించామని వెల్లడించారు. అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీ కేంద్ర నాయకత్వానిదేనని స్పష్టం చేశారు. ఫైనల్ నిర్ణయం పార్టీ కేంద్ర నాయకత్వమే తీసుకుంటుందని అన్నారు. అంతకుముందు ఇలా.. గతంలో 1998లో బీజేపీ, బీజేడీ మధ్య పొత్తు కుదిరింది. ఇందులో భాగంగా 1998, 1999, 2004లో లోక్‌సభ ఎన్నికలు, 2000, 2004 సంవత్సరాలలో అసెంబ్లీ ఎన్నికలలో ఇరు పార్టీలు సత్తా చాటాయి. కాగా, అనూహ్యంగా 2009లో సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో బీజేడీకి తక్కువ స్థానాలు ఇవ్వడంతో కూటమి విడిపోయింది. ఇక, తాజాగా మరోసారి దాదాపు 15 ఏళ్ల తర్వాత రెండు పార్టీల మధ్య పొత్తులపై చర్చలు జరగడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. -
ఢిల్లీ బిల్లుపై కేంద్రానికి బీజేడీ మద్దతు
న్యూఢిల్లీ: ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుకు ఒడిశా అధికార పక్షం బిజూ జనతా దళ్(బీజేడీ) మద్దతివ్వనుంది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి సైతం వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేడీ నిర్ణయాన్ని మంగళవారం రాజ్యసభలో ఆ పార్టీ నేత సస్మిత్ పాత్ర ప్రకటించారు. బీజేడీ నిర్ణయం ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో పార్లమెంట్లో ముఖ్యంగా రాజ్యసభలో కేంద్రానికి పెద్ద ఊరటనివ్వనుంది. బీజేపీ కూటమితోగానీ ప్రతిపక్షాలతోగానీ జట్టుకట్టకుండా ఢిల్లీ ఆర్డినెన్స్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తర్వాత కేంద్రానికి మద్దతు పలికిన రెండో పార్టీ బీజేడీ. రాజ్యసభలో అధికార పక్షంపై ప్రతిపక్ష పార్టీలదే పైచేయిగా ఉంది. బీజేడీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నిర్ణయంతో రాజ్యసభలో కేంద్రం తీసుకొచ్చే బిల్లును ఓడించాలన్న ప్రతిపక్షాల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేడీలకు చెరో 9 మంది సభ్యుల బలముంది. ఈ రెండు పార్టీల 18 మంది సభ్యుల మద్దతుతో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లు రాజ్యసభలో నెగ్గేందుకు అవకాశమేర్పడింది. -
లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోటీ: బీజేడీ
భువనేశ్వర్: ఏ పార్టీతోనూ తమకు పొత్తు లేదని, ఏ కూటమిలోనూ తాము భాగస్వామి కాదని ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, దీనిపై తమ అధినేత నవీన్ పట్నాయక్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని తెలియజేశారు. అన్ని పార్టీలతో సమదూరం పాటిస్తున్నామని వివరించారు. ఒడిశా రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధే తమ ప్రధాన అజెండా అని వెల్లడించారు. నవీన్ పట్నాయక్ మిత్రుడైన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రతిపాదిస్తున్న థర్డ్ ఫ్రంట్‌కు దూరంగా ఉంటామని అన్నారు. నవీన్ పట్నాయక్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. థర్డ్ ఫ్రంట్‌లో తమ పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేశారు. నవీన్ పట్నాయక్ అంతకుముందు నితీశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. వారు ఏం మాట్లాడుకున్నారన్నది తెలియరాలేదు. -
లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిజు జనతా దళ్ (బీజేడీ) ఒంటరి పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. గురువారం ప్రధాని మోదీని కలిసి మంతనాలు జరిపారు. బీజేపీకి, కాంగ్రెస్‌కి సమానదూరం పాటిస్తానని తర్వాత మీడియాతో పట్నాయక్ చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం కోసం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తాను చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నవీన్ పట్నాయక్‌ను కలుసుకున్న మర్నాడే ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతామని తేల్చి చెప్పడం విశేషం. నితీశ్ భువనేశ్వర్‌కు వచ్చి తనను మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని పట్నాయక్ చెప్పారు. 2000 సంవత్సరం నుంచి ఒడిశాలో అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ అప్పట్నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య వచ్చే వివాదాస్పద అంశాల్లో తటస్థ వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. -
Padampur MLA: పద్మపూర్ ఎమ్మెల్యే మృతి
భువనేశ్వర్: పద్మపూర్ శాసనసభ సభ్యుడు, మాజీమంత్రి బిజయ్‌రంజన్ సింఘ్ బొరిహా(65) స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం పద్మపూర్‌లో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. పద్మపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా 5సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలి 2సార్లు జనతా దళ్ టికెట్‌తో పోటీ చేసి గెలుపొందారు. బిజూ జనతాదళ్ ఆవిర్భావం నుంచి బీజేడీ టికెట్‌తో పోటీ చేసి, నిరవధికంగా గెలుపొందారు. 1990 నుంచి 2000 వరకు జనతాదళ్ అభ్యర్థిగా, 2000, 2009, 2019 ఎన్నికల్లో బిజూ జనతాదళ్ అభ్యర్థిగా శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 2009లో రాష్ట్ర దళిత, హరిజన అభివృద్ధి విభాగం మంత్రి పదవి ఆయనకు వరించింది. ఈ సందర్భంగా సమర్ధవంతమైన నాయకుడిని బీజేడీ కోల్పోయిందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. ప్రజా సంక్షేమం ధ్యేయంగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు సాధించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చదవండి: (దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. స్టేజ్‌పైనే కుప్పకూలిన ప్రముఖ గాయకుడు) శాసనసభ ఆవరణలో గార్డ్ ఆఫ్ ఆనర్ భువనేశ్వర్: బర్గడ్ జిల్లా పద్మపూర్ ఎమ్మెల్యే దివ్యరంజన్ బొరిహాకు శాసనసభ ఆవరణలో అంతిమ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం గార్డు ఆఫ్ ఆనర్ నిర్వహించారు. సాంఘిక సంక్షేమ, దివ్యాంగుల సాధికారిత విభాగం మంత్రి అశోక్‌చంద్ర పండా, ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమశాఖ మంత్రి అతున్ సవ్యసాచి నాయక్, శాసనసభ విపక్షనేత జయనారాయణ మిశ్రా, పార్లమెంట్ సభ్యురాలు సులత దేవ్, ఎమ్మెల్యేలు ప్రణబ్ ప్రకాశ్‌దాస్, అనంత నారాయణ జెనా, సుశాంత రౌత్, మాజీ ఎమ్మెల్యే రమారంజన బలియార్ సింఘ్, రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు మీనతి బెహరా, రాష్ట్ర శాసనసభ కార్యదర్శి దాశరథి శత్పతి, పలువురు ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. -
స్థానిక ఎన్నికలు.. తేలని పంచాయితీ!
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికల కాలపరిమితి ముగిసి, నేటికి మూడేళ్లు పూర్తయింది. అయినా ఎన్నికల నిర్వహణకు సర్కారు ఏమాత్రం ముందుకు రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించి, తీరాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడం..ఈ క్రమంలో ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తుండడం నుంచి ఈ ‘పంచాయితీ’ నడుస్తోంది. అయితే కొన్నిరోజుల క్రితం ఓబీసీల ఓటు బ్యాంకు సమకూర్చుకునేందుకు ఎన్నికల్లో వారికి 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అధికార బీజేడీ ప్రకటన జారీ చేసింది. చదవండి: వైరల్ వీడియో: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం..! ఇప్పుడు మళ్లీ మరో సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఎన్నికలు జరిగిన రోజునే ఫలితాలు ఇవ్వకుండా ఫలితాల కోసం ఓ ప్రత్యేక రోజుని కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే ఇదివరకు ఏ పంచాయతీలో జరిగే ఎన్నికల ఫలితాలు.. ఎన్నికలు జరిగిన రోజునే ప్రకటించేవారు. ఇప్పుడు అలా కాకుండా సమితిలోని మొత్తం పంచాయతీల బ్యాలెట్ బాక్సులను సమితి కేంద్రానికి తరలించి, లెక్కించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ రెండు మార్పుల పట్ల ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మండిపడుతున్నాయి. ఇదంతా ఓట్లను తారుమారు చేసి, గెలిచేందుకే నవీన్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేస్తోందని విమర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 వేలకు పైబడి పంచాయతీలు ఉండగా, 314 సమితులు ఉన్నాయి. 15 రోజుల్లో అభ్యంతరాలు.. పంచాయతీ ఎన్నికల్లో ఇదివరకున్న బూత్ స్థాయి ఓట్ల లెక్కింపునకు తెరపడుతుంది. సమితి ప్రధాన కార్యాలయంలో కేంద్రీకృత విధానంలో ఈసారి ఓట్లను లెక్కిస్తారు. సమితి వ్యాప్తంగా అంచెలంచెలుగా పోలింగ్ పూర్తయిన తర్వాత అన్ని బూత్‌లలో పోలైన ఓట్లను ఒకేసారి లెక్కపెడతారు. ఈ నేపథ్యంలో ఒడిశా గ్రామ పంచాయతీ ఎన్నికల నిబంధనలు–1965 సంస్కరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు జారీ చేసింది. వీటి పట్ల సలహాలు, సూచనలు, అభ్యంతరాలను 15 రోజుల్లోగా దాఖలు చేయాలని అభ్యర్థించింది. ఈ ప్రక్రియ తర్వాత ఒడిశా గ్రామ పంచాయతీ ఎన్నికల నిబంధనలు–2021 అమలు చేసి, తాజాగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చదవండి: ఓరి భగవంతుడా .. కష్టాలు గట్టెక్కాయని అనుకునేలోపే.. -
తూర్పున పొడిచేదెవరు?
మాతృభాషలో సరిగా మాట్లాడలేరు. కానీ రెండు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. వెనుకబడిన రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఇదీ అని చూపించారు. అవినీతి బురదలో కూరుకుపోయిన రాజకీయాల్లో ఆయన పథం నవీనం, నిత్యనూతనం. కేంద్రంలో ఇరవై ఏళ్లుగా ఎన్ని పార్టీలు మారినా ఒడిశాలో బిజూ జనతాదళ్ (బీజేడీ)కి ఎదురు లేదు. ఆ రాష్ట్రంలో సీఎం నవీన్ పట్నాయక్‌కు తిరుగులేదు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నవీన్‌పై నమ్మకం చెక్కు చెదరకపోయినా ఆయన చుట్టూ ఉండే వారిపై అసమ్మతి రాజుకుంటోంది. ముఠా పోరు తారస్థాయికి చేరుకుంది. ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయా? బీజేపీ క్షేత్రస్థాయిలో పట్టుపెంచుకోవడం బీజేడీకి ఎసరు పెడుతుందా? ఈ రాష్ట్రంలో మోదీ మేజిక్ ఎంతవరకు పని చేస్తుంది? ఈసారి ప్రజా తీర్పు ఎటు ఉండబోతోంది?.. అవినీతి రహిత పరిపాలన. ఇదే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ జెండా.. ఎజెండా కూడా. అదే ఆయన ఇమేజ్ను జాతీయ స్థాయిలో పెంచింది. ప్రధాని కావాల్సిన లక్షణాలు మెండుగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని కలిగించింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవీన్‌ను ఇన్నాళ్లూ అక్కున చేర్చుకున్న జనం ఈసారి తమ దారి మార్చుకుంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అవినీతి అధికారులు, నేతలపై నవీన్ పట్నాయక్ చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మైనింగ్, చిట్‌ఫండ్ స్కామ్‌లో నవీన్ వ్యవహార శైలి ప్రజల్లో చర్చనీయాంశమైంది. పార్టీలో అంతర్గతంగా చాలా కాలంగా అసమ్మతి సెగలు కక్కుతోంది. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారిలో బీజేడీపై విముఖత ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఎన్నికల బరిలో ఉన్న బీజేడీ నేతలు గెలుపు గుర్రాలు కాదన్న భావన నెలకొంది. గత ఎన్నికల్లో మోదీ హవా దేశాన్ని ఊపేసినా ఒడిశా తన రూటే సెపరేటు అనిపించుకుంది. 21 సీట్లకు 20 సీట్లను బిజూ జనతాదళ్ (44.10% ఓట్లు) గెలుచుకుంది. బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ (21.50%) బీజేపీ కంటే మెరుగ్గా 26 శాతం ఓట్లు సంపాదించినా సీట్లను మాత్రం సాధించలేకపోయింది. మహిళల్లో తరగని ఆదరణ మహిళా ఓటర్లలో ఇప్పటికీ నవీన్ పట్నాయక్‌కి గట్టి పట్టు ఉంది. 70 లక్షలకు పైగా మహిళలతో స్వయం సహాయక గ్రూపుల్ని ఏర్పాటు చేసి శక్తి పథకం కింద వారికి అండదండగా ఉంటున్నారు. ఆ గ్రూపు మహిళలే బీజేడీ ఓటు బ్యాంకుకి శక్తిగా మారారు. స్వయం సహాయక గ్రూపుల్లో దేశంలోనే ఒడిసా నంబర్‌వన్‌గా నిలిచింది. మహిళలకు 33 శాతం టికెట్లు ఇవ్వడం కూడా నవీన్‌కు కలిసొచ్చే అంశం. ‘ఎవరు మా జీవనోపాధికి అండగా ఉంటారో వాళ్లకే ఓటు వేస్తాం‘ అని మహిళలు బహిరంగంగానే చెబుతున్నారు. బీజేపీ ‘ఆపరేషన్ ఒడిశా’ ఫలిస్తుందా దక్షిణాదిన పట్టు లేదు. ఉత్తరాదిన పట్టు కోల్పోతోందన్న అనుమానాలున్నాయి. అందుకే బీజేపీ ఈసారి తూర్పు రాష్ట్రాలపైనే గురి పెట్టింది. 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఒడిశా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పలుమార్లు ఒడిశాలో పర్యటించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 వేల పోలింగ్ కేంద్రాల స్థాయిలో ‘మా బూత్ పటిష్టం’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2017లో జరిగిన స్థానిక ఎన్నికల్లో దాని ఫలితం స్పష్టంగా కనిపించింది. బీజేపీ 296 పంచాయతీ స్థానాలను గెలుచుకుంది. ముఖ్యంగా పశ్చిమ ఒడిశా జిల్లాల్లో బీజేపీ పట్టు బాగా పెంచుకుంది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సుభాష్ చౌహాన్ పార్టీ పట్టు పెరగడానికి కృషి చేశారు. ఆయనతో పాటు బీజేపీకి చెందిన ఇద్దరు ఒరియా కేంద్ర మంత్రులు తమ వంతు ప్రయత్నాలు చేశారు. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గిరిజన వ్యవహారాల మంత్రి జ్యుయల్ ఒరమ్లు కోస్తా ఒడిశా, ఆదివాసీల జనాభా అధికంగా ఉండే పశ్చిమ ఒడిశా ప్రాంతంలో పట్టు బిగించారు. తమ పార్టీకి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన నవీన్ పట్నాయక్ రాజకీయ వ్యూహాలకు తెరతీశారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సుభాష్ చౌహాన్‌ను తన గూటికి తెచ్చుకున్నారు. బీజేపీ అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించడంతో నవీన్ తన గూటికి లాక్కొని బోలాంగిర్ బీజేడీ ఇన్చార్జ్గా నియమించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విస్తృతంగా ప్రచారం చేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా కమలనాథులపై విరుచుకుపడుతున్నారు. ‘ఫైలిన్, హుద్‌హుద్, తిత్లీ తుపాను సమయంలో బీజేపీ నేతలు ఒక్కరూ కనిపించరు. కానీ ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి మొసలి కన్నీరు కారుస్తారు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. వలసలే కమలానికి బలమా? బిజూ జనతాదళ్‌లో అధినేత నవీన్ పట్నాయక్ తర్వాత వినిపించే పేర్లు రెండే. పశ్చిమ ఒడిశాకు చెందిన బలభద్ర మాఝీ , కోస్తా ఒడిశాకు చెందిన బైజయంత్ పాండా.. వీళ్లిద్దరూ 2014 ఎన్నికల్లో బిజూ జనతాదళ్ తిరుగులేని విజయం సాధించేలా చేశారు. అయిదేళ్లు తిరిగాయి. 2019 ఎన్నికలు మొదలయ్యాయి. సీన్ కట్ చేస్తే మాఝీ, పాండా ఇద్దరూ బీజేడీని వీడి బీజేపీ గూటికి చేరారు. నవరంగ్ పూర్, కేంద్రపారా నుంచి పోటీకి దిగుతున్నారు. వీళ్లిద్దరే కాదు బీజేడీ ఎంపీ ప్రత్యూష రాజేశ్వరిసింగ్, కె.నారాయణరావు, దామా రౌట్, యువ నాయకులు బాబు సంగ్, సుబ్రాంశుదాస్, ప్రకాశ్ బెహరా వంటి వారు ఉన్నారు. బీజేడీలో టికెట్లు రాని వారంతా బీజేపీకి క్యూ కట్టేశారు. ‘బిజూ జనతాదళ్‌లో ఈసారి నిరాశా నిస్పృహలు కనిపిస్తున్నాయి. ఎంతోమంది నాయకులు మా పార్టీతో చాలా కాలంగా టచ్‌లో ఉన్నారు. అందుకే మేం గేట్లు ఎత్తేయడంతో ప్రముఖ నాయకులు వచ్చి చేరారు’ అని బీజేపీ ఒడిశా శాఖ కార్యదర్శి జతిన్ మొహంతీ అన్నారు. ఈ ఫిరాయింపులతో కమలం పార్టీ సంస్థాగతంగా బలిష్టమై ప్రాంతీయ పార్టీని ఢీకొనే శక్తిగా ఎదిగిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బసంత్ కుమార్ పాండా మేనల్లుడు హరీష్ చంద్ర పాండా బీజేడీలో చేరడం విశేషం. బీజేడీ నుంచి కొత్త ముఖాలే ఎక్కువ నవీన్ పట్నాయక్‌పై ప్రజల్లో ఇంకా ఇమేజ్ ఉన్నప్పటికీ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉండడంతో ఆయన చాలా మంది సిటింగ్‌లకు సీట్లు నిరాకరించారు. బలంగీర్ నుంచి సింగ్‌దేవ్, పూరి నుంచి పినాకి మిశ్రా, కటక్ నుంచి భర్తృహరి మెహతాబ్‌కి మాత్రమే మళ్లీ టికెట్లు ఇచ్చారు. ఢెంకనాల్ ఎంపీ తథాగత సపతి ఏకంగా రాజకీయాల నుంచి వైదొలిగినట్టు ప్రకటించారు. నవీన్ పట్నాయక్ టికెట్లు ఇచ్చిన వారిలో ఎక్కువ మంది కొత్త ముఖాలు కావడంతో ఫలితాలపై ఫిరాయింపుల ప్రభావం ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొంది. రైతులనే నమ్ముకున్న కాంగ్రెస్ ఒకప్పుడు బాగా పట్టు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు నుంచి మూడో స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన కనీస ఆదాయ పథకం కూడా పార్టీకి ఊపు తీసుకురాలేదు. రాహుల్ పలుమార్లు ఒడిశా రాష్ట్ర పర్యటనలు చేసినా కార్యకర్తల్లో నైతిక స్థైర్యం పెరగడం లేదు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న పశ్చిమ ఒడిశా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థిని నిలబెడితే రైతులు హస్తం గుర్తుకే ఓటు వేసే సంప్రదాయం ఉంది. ఇక చాలాచోట్ల రైతులు నోటా గుర్తును ఎంచుకుంటున్నారంటే వారు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో అర్థమవుతుంది. బిజు జనతాదళ్, బీజేపీపై నమ్మకం కోల్పోయిన అన్నదాతలు తమ పార్టీ వెంట నడుస్తారన్న ఆశలో రాహుల్ ఉన్నారు. జమిలి ఎన్నికలు ఎవరి కొంప ముంచుతాయి? ఒడిశాలో ఏకకాలంలో అసెంబ్లీకి, లోక్‌సభకు ఎన్నికలు జరుగుతుండటంతో క్రాస్ ఓటింగ్ భయం బిజూ జనతాదళ్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరిగితే 70 శాతం మంది ఒకే పార్టీకి వేస్తారని ఒక అంచనా. కానీ ఒడిశాలో అలాంటి ఫార్ములాలకు అతీతంగా అసెంబ్లీకి నవీన్ పట్నాయక్‌కు, పార్లమెంటుకి నరేంద్ర మోదీకి వేస్తారని అంచనాలైతే ఉన్నాయి. ప్రధానిగా మోదీకున్న ఇమేజ్, బాలాకోట్ దాడుల తర్వాత పెరిగిన దేశభక్తి యువతరం మోదీ వైపు చూసేలా చేస్తోంది. ‘ఇవాళా రేపు ఓటర్లు తెలివి మీరారు. అసెంబ్లీకి నవీన్‌కు వేసినా, పార్లమెంటు వచ్చేసరికి వారి మొగ్గు మోదీకే’ అని ఒడిశాలో ఎన్నికల విశ్లేషకుడు మహాపాత్రో అంచనాగా ఉంది. కేంద్రపార, ఢెంకనాల్, సంబల్పూర్, బార్గఢ్, కాందమాల్, కియోంజార్, భువనేశ్వర్‌లో హోరాహోరీ పోరు నెలకొందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. మొత్తం మీద ఒడిశా రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే ‘సీఎం నవీన్ పట్నాయక్ ఇమేజ్ చెక్కు చెదరలేదు. బీజేపీ క్షేత్రస్థాయిలో బలోపేతమైంది. సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ మళ్లీ తన ప్రాభవాన్ని చూపే ప్రయత్నం చేస్తోంది’ అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. సంక్షేమ ‘కమలం’ ► కేంద్రంలో మోదీ సర్కార్ రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏడాదికి రూ.6 వేల పథకం ప్రకటించింది. ► గ్రామాల్లో నిరుపేద మహిళలకు ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ స్టౌల పంపిణీ, బేటీ బచావో బేటీ పడావో, స్వచ్ఛ భారత్, అటల్ పెన్షన్ యోజనకు జనంలో ఆదరణ కనిపిస్తోంది. హామీల శంఖారావం ► నవీన్ పట్నాయక్ మోదీని ఎదుర్కోవడానికి నిరుపేదలు లబ్ధి పొందే 60 కార్యక్రమాలు రూపొందించారు. ► ‘కాలియా పథకం’ కింద రైతులకు ఏడాదికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ► ‘మమత పథకం’ ద్వారా గర్భిణులకు నగదు బదిలీ పథకం, ఆహార్ యోజన కింద రూపాయికే కిలో బియ్యం (రూ.5కి భోజనం), ► నిరుపేదలకు ‘బిజూ పక్కా ఘర్ యోజన’ పేరిట ఇళ్ల నిర్మాణ పథకాలు ప్రవేశపెట్టారు. మోదీ వర్సెస్ మినీ మోదీ ఇద్దరూ ఇద్దరే. జనంలో ఒకే రకమైన ఇమేజ్ సాధించిన వారే. సీఎంలుగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవారే. ఇప్పుడు వారిద్దరి మధ్యే పోటీ. ప్రధాని హోదాలో మోదీ, సీఎం హోదాలో నవీన్ పట్నాయక్ (మినీ మోదీగా ఒడిశాలో పిలుస్తారు) ఒడిశా బరిలో ఢీకొంటున్నారు. ఇద్దరికీ కుటుంబ బం«ధాలు లేవు. జనమే వారి కుటుంబం. ఏదో ఒకటి చేయాలన్న తపన ఇద్దరిలోనూ కనిపిస్తుంది. ఒడిశాలో రైతులు, మహిళలు, ఆదివాసీల ఓట్లే కీలకం. అందుకే వారిని ఆకర్షించడానికి రూపొందించిన పథకాలే ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మారాయి. ‘ఒడిశాలో అత్యధిక భాగం ఒకప్పుడు సంస్థానాధీశుల పాలనలో ఉండేది. తాము పైకి ఎదగాలన్న ఆశలు ఎవరిలోనూ పెద్దగా ఉండవు. ఒరియా ప్రజలు చిన్న చిన్న విషయాలకే అంతులేని ఆనందాన్ని పొందుతారు. నవీన్ పట్నాయక్‌ను దయార్ద్ర హృదయుడైన రాజుగానే ఇప్పటికీ చూస్తున్నారు. సర్వేలు కూడా మోదీ ఇమేజ్ పెరిగినా, నవీన్ పై చేయి సాధిస్తారనే అంచనా వేస్తున్నాయి’ – రాజేశ్ మహాపాత్ర, మాజీ జర్నలిస్టు, ‘ఒడిశా ఆలోచన చక్ర’ పేరిట రాజకీయ చర్చల నిర్వాహకుడు. -
నవీన్ పట్నాయక్‌కు చెక్ పెట్టేదెవరు?
సాక్షి, న్యూఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సృష్టించిన ప్రభంజనాన్ని తట్టుకొని నిలబడగలిగింది ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతా దళ్. ఒడిశాలోని 21 లోక్‌సభ సీట్లకుగాను ఏకంగా 20 సీట్లలో ఆ పార్టీ విజయం సాధించడం విశేషం. అదే సమయంలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 147 స్థానాలకుగాను 117 స్థానాల్లో విజయం సాధించడం కూడా విశేషం. అంతకుముందు ఎన్నికల్లో అంటే, 2009లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కన్నా ఎక్కువ సీట్లలో విజయం సాధించడం మరీ విశేషం. 2009 ఎన్నికల్లో బిజూ జనతాదళ్ 14 లోక్‌సభ, 103 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించింది. అంటే బిజూ జనతాదళ్ పార్టీని గెలిపించడం కంటే బీజేపీని మట్టికరిపించడమే ప్రధాన లక్ష్యంగా నాటి ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇచ్చినట్లు అర్థం అవుతోంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 19 ఏళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న నవీన్ పట్నాయక్‌కు చెక్ పెట్టేవాళ్లే లేరా? ఇన్నేళ్లయినా ఆయన ప్రభుత్వంపైన ప్రజల్లో అసంతృప్తిగానీ, వ్యతిరేకతగానీ పెరగలేదా? 2014 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన బీజేపీ చాలెంజ్ చేసినట్లు ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసింది. అదే సవాల్ మేరకు ఒడిశాలో పాగా వేయగలదా ? 40 లక్షల మంది పార్టీ కార్యకర్తలను చేర్చుకోవడం ద్వారా రానున్న ఎన్నికల్లో ‘మిషన్ 120’ (120 అసెంబ్లీ సీట్లను గెలుచుకోవడం) ద్వారా పట్నాయక్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ 2015లో అమిత్ షా తొడగొట్టడం ఏ మేరకు నిజమవుతుంది? 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో హవా సష్టించిన బీజేపీ 2019 ఎన్నికల్లోనూ హవా కొనసాగిస్తుందా? పార్టీకి కంచుకోటయిన గంజాం ప్రాంతంలోని ‘హింజిలీ’ అసెంబ్లీ నియోజక వర్గానికి ఆది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నవీన్ పట్నాయక్ మొదటిసారి బిజపూర్ నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం వెనకనున్న మర్మం ఏమిటీ? నవీన్ పట్నాయక్ బిజపూర్ నుంచి పోటీ చేయడం అంటే ‘హింజలీ’ నుంచి ఓడిపోతాననే భయమే కారణమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. విస్తారమైన రోడ్లు, మంచినీరు, విద్యుత్, పారిశుద్ధ్యం లాంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పించడంతోపాటు సాంకేతికంగా, ఆర్థికంగా నియోజకవర్గం అభివద్ధికి బాటలు వేసిన పట్నాయక్ ఆ నియోజక వర్గం నుంచి ఓడిపోవడమంటే అది కలే. ఆ భయమే అయనకుంటే బీజేపీ కాస్త బలంగా ఉన్న బిజపూర్ను ఆయన ఎందుకు ఎన్నుకుంటారు ? బీజేపీకే చెక్ పెట్టేందుకే! అవును.. అందుకనేనంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2000, 2004లో వరుసగా రెండు సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసిన నవీన్ పట్నాయక్ 2009 ఎన్నికల్లో బీజేపీకి తిలోదకాలిచ్చి ఒంటరిగా పోటీ చేసి పార్టీని గెలుపించుకున్నారు. 2017లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో 846 సీట్లలో 473 సీట్లలో బిజూ జనతాదళ్ విజయం సాధించగా, బీజేపీ 296 సీట్లలో విజయం సాధించింది. 2012 ఎన్నికల్లో కేవలం 36 సీట్లకు పరిమితమైన బీజేపీ కాంగ్రెస్ పార్టీని మూడో స్థానంలోకి నెట్టేసి 296 సీట్లను గెలుచుకోవడం విశేషం. అప్పటి నుంచి పార్టీ బలోపేతానికి రాష్ట్రంలో అవకాశం ఉందన్న విశ్వాసం బీజేపీకి కలిగింది. అయితే 2018లో బిజపూర్ అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజూ జనతాదళ్ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థిపై 40 వేల మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం కొనసాగుతున్న 2019 ఎన్నికల ప్రక్రియకు ఈ ఫలితాన్ని సూచికగా తీసుకోవచ్చు! ఇన్నేళ్లు అవుతున్నా ఏ నియోజకవర్గం ప్రజల్లో కూడా నవీన్ పట్నాయక్ పట్ల వ్యతిరేకత ఇప్పటికీ కనిపించక పోవడం విశేషం. అయితే పలు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల పట్ల ప్రజలకు వ్యతిరేకత ఉంది. అందుకని కొన్ని నియోజక వర్గాల్లో ఎవరికి ఓటు వేయాలనే విషయంలో ఇప్పటికీ సందిగ్ధత నెలకొని ఉంది. నాలుగు దశల్లో పోలింగ్ జరుగనున్న ఒడిశాలో గురువారం తొలి విడత పోలింగ్ జరిగింది. -
ఎక్కువ శాతం మహిళలకు టిక్కెట్లు సబబేనా?
సాక్షి, న్యూఢిల్లీ : బిజూ జనతాదళ్ నాయకుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయడానికి 33 శాతం మంది మహిళలకు టెకెట్లు కేటాయించగా, బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ ఏకంగా 40 శాతం ఎంపీ టిక్కెట్లను మహిళలకు కేటాయించిన విషయం తెల్సిందే. ఎందుకు వారు మహిళలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు? మహిళల్లో అక్షరాస్యతతోపాటు రాజకీయ అవగాహన పెరిగిందా ? వారయితేనే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయా ? ఉంటే ఎందుకు ఉంటాయి ? వారు తీసుకున్న నిర్ణయం సబబేనా? నేడు భారత దేశంలో ప్రాథమికే కాదు, మాధ్యమిక విద్యను పూర్తి చేస్తున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం దేశంలో మాధ్యమిక విద్యను పూర్తి చేస్తున్న మహిళల సంఖ్య 75.8 శాతం కాగా, పురుషుల సంఖ్య74.59 శాతం ఉంది. ఆ మహిళల్లో ప్రతి పది మందిలో ఏడుగురు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇక వారిలో ప్రతీ నలుగురిలో ముగ్గురు ఏ వత్తిని చేపట్టాలో ముందుగానే నిర్ణయానికి వస్తున్నారు. మహిళలు కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని మహిళల్లో 68 శాతం మంది కోరుకుంటున్నట్లు ‘లోక్‌నీతి–సీఎస్డీఎస్’ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. వారిలో ప్రతి ఐదుగురిలో ముగ్గురు కుటుంబ సభ్యుల ప్రభావానికి లోనుకాకుండా స్వతంత్ర నిర్ణయం మేరకు అభ్యర్థులకు లేదా పార్టీలకు ఓటు వేస్తామని చెప్పారు. పంచాయతీ రిజర్వేషన్లతోనే చైతన్యం పంచాయతీలు, స్థానిక సంస్థల్లో 40 శాతానికిపైగా సీట్లను మహిళలకు కేటాయిస్తూ 1992లో 73, 74 రాజ్యాంగ సవరణలను తీసుకరావడం వల్ల మహిళల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. పంచయతీరాజ్ లెక్కల ప్రకారం నేడు పంచాయతీరాజ్ సంస్థల్లో 46 శాతం సీట్లకు మహిళలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది పంచాయతీ రాజ్ పదవులకు పోటీచేసి విజయం సాధించగా, మరో 20 లక్షల మంది మహిళలు పోటీచేసి ఓడిపోయారు. ఓటర్ల చైతన్యం గురించి గ్రామ స్థాయిలో జరగాల్సిన అభివద్ధి కార్యక్రమాలు, ఇతర సమస్యల గురించి నేడు మహిళలకు ఎక్కువ అవగాహన ఉందని ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో విమెన్స్ స్టడీస్ డివిజన్‌కు నాయకత్వం వహిస్తున్న బిద్యుత్ మొహంతీ తెలిపారు. స్వచ్ఛందంగా మహిళా పోలింగ్ నేడు మహిళా ఓటర్లలో కూడా ఎంతో చైతన్యం పెరిగిందని, ఎవరి ప్రభావం వల్లనో కాకుండా మహిళా సాధికారితను సాధించడంలో భాగంగా స్వచ్ఛందంగా మహిళా ఓటర్లు ముందుకు వచ్చి ఓటేస్తున్నారని బ్రూకింగ్స్ ఇండియా డైరెక్టర్ శామిక రవి చెప్పారు. 1962 నాటి ఎన్నికల్లో పురుషులు, మహిళా ఓటర్ల మధ్య వ్యత్యాసం 15 శాతం ఉండగా, అది 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నాటికి 1.5 శాతానికి పడిపోయింది. 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషులకన్నా మహిళల పోలింగ్ శాతం పెరిగింది. ‘బీమారు’గా వ్యవహరించే వెనకబడిన రాష్ట్రాలైన బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మహిళా ఓటర్ల సంఖ్య పెరగడం విశేషం. 1960 దశకంతో పోలిస్తే 2000 దశకం నాటికి దేశంలో దేశంలో లింగ నిష్పత్తి బాగా పెరగ్గా, పోలింగ్‌లో నిష్పత్తి బాగా తగ్గడం గమనార్హం. హింస తగ్గడం, సదుపాయాలు పెరగడం పోలింగ్ కేంద్రాల వద్ద హింస తగ్గడం, మహిళలకు సదుపాయాలు పెరగడం, మహిళల ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం 1990 నుంచి ఎన్నికల కమిషన్ ప్రత్యేక డ్రైవ్ కొనసాగించడం తదితర కారణాల వల్ల మహిళల పోలింగ్ శాతం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఓటర్లుగా నమోదు చేయించుకోవడంలో కొంత మంది మహిళలు విఫలమవుతున్నప్పటికీ వారి సంఖ్య పురుషులకన్నా తక్కువగా ఉండడం విశేషం. ఎన్నికల కమిషన్ మార్చి నెలలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం 4.35 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు కోసం తమ పేర్లను నమోదు చేసుకోగా 3.80 కోట్ల మంది పురుషులు కొత్తగా ఓటు హక్కు పొందారు. లోక్‌సభలో 12.1 శాతం మహిళల ప్రాతినిధ్యం దేశం మొత్తం జనాభాలో 48.1 శాతం మంది మహిళలు ఉండగా, లోక్‌సభలో మాత్రం ప్రస్తుతం మహిళల ప్రాతినిధ్యం మాత్రం 12.1 శాతం మాత్రమే. పార్లమెంట్ ఉభయ సభలతోపాటు రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఇప్పటికీ పార్లమెంట్లో పెండింగ్‌లో ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బిజూ జనతాదళ్, తృణముల్ కాంగ్రెస్ పార్టీలు తీసుకున్న స్వచ్ఛంద నిర్ణయం ఎంతో హర్షనీయం. -
ఒడిశాలో రాజకీయ హత్య..!
కియోంఝర్ : మొదటి దశ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న వేళ ఒడిశాలో మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర బహెరా దారుణ హత్యకు కలకలం రేపింది. 2014 ఎన్నికల్లో ఘాజీపుర నుంచి బహెరా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తాజా ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేడీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతుండగా.. కొందరు దుండగులు ఆయనను దారుణంగా హతమార్చారు. సోమవారం రాత్రి ధకోట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో బహెరా ఇంటికి చేరుకున్న 10 మంది దుండగులు.. ఆయనను బయటికి పిలిచి మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బహెరాను ఆనందపూర్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కాగా, ఈ హత్య కేసులో నలుగురు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. సంజీవ్ పృష్టి, అజిత్ పృష్టి, దోలో గోవింద బొతాయ్, ప్రమోద్ దాస్‌ను విచారిస్తున్నారు. ఇదిలాఉండగా.. బీజేడీలో బహెరా చేరికతో రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతాయన్న కారణంగా స్థానిక (ఘాజీపుర) ఎమ్మెల్యే, విద్యాశాఖమంత్రి బద్రీనారాయణ్ దళ్ ఈ హత్య చేయించారని బీజేపీ నేత పృథ్విరాజ్ కౌనర్ ఆరోపించారు. బద్రీనారాయణ తనయులే ఈ హత్యకేసులో కీలక సూత్రదారులని అనుమానం వ్యక్తం చేశారు. ‘మాపై బీజేపీ కావాలనే హత్యారోపణలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఒడిశాలో ఓటమి తప్పదనే బీజేడీ ప్రతిష్టను దిగజార్చాలని కుట్రలు చేస్తోంది’ అని బద్రీ విమర్శించారు. బెహెరా హత్యకేసును సీబీఐకి అప్పగిస్తూ సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు. -
కమలంపై కనక వర్షం.. కాంగ్రెస్‌కు మాత్రం రూ.11 కోట్లే!!
సాక్షి, న్యూఢిల్లీ : ఓవైపు... వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతుండగా.. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలకు ‘ఆర్థిక భారాన్ని’ తగ్గించేందుకు కార్పోరేట్ సంస్థలు విరాళాల రూపంలో సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా చందాలు అందించి తమ వంతు సాయం చేస్తున్నాయి. అయితే ఏయే పార్టీకి ఎన్నెన్ని విరాళాలను అందాయనే విషయంపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం... 2017-18గాను వివిధ పార్టీలన్నింటికీ కలిపి సంయుక్తంగా 194 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. ఇందులో అత్యధిక వాటా అధికార బీజేపీకి దక్కిందని నివేదిక పేర్కొంది. మొత్తం విరాళాల్లో 86.59 శాతం అంటే సుమారు 167.80 కోట్ల రూపాయలు కాషాయ పార్టీకి అందాయని తెలిపింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో సహా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, బిజు జనతాదళ్ వంటి పలు ప్రాంతీయ పార్టీలన్నింటికీ కలిపి 25.98 కోట్ల రూపాయలు చందాల రూపేణా అందాయని వెల్లడించింది. ఇందులో కాంగ్రెస్ వాటా 11 కోట్ల రూపాయలని ఏడీఆర్ తెలిపింది. ఇది బిజు జనతా దళ్ పార్టీ(రూ.14 కోట్లు)కి దక్కిన మొత్తం కంటే తక్కువ కావడం గమనార్హం. భారతీ ఎయిర్టెల్ పెద్ద మనసు.. ఎలక్ట్రోరల్ ట్రస్టులకు అందిన విరాళాలతో పాటు టాప్-10 దాతల వివరాలను కూడా ఏడీఆర్ తన నివేదికలో పొందుపరిచింది. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా 25.005 కోట్ల రూపాయలు అందించగా, రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ రూ. 25 కోట్లు, యూపీఎల్ లిమిటెడ్ రూ. 20 కోట్లు అందజేసాయి. -
బీజేడీ ఎంపీ షాకింగ్ నిర్ణయం
భువనేశ్వర్: బిజు జనతా దళ్(బీజేడీ) ఎంపీ బైజయంత్ పాండా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సంబంధించి ఓ కొత్తదారి ఎంచుకున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలకు గానూ తాను కేవలం లోక్‌సభ జరిగిన సమయానికి మాత్రమే వేతనం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు బీజేడీ ఎంపీ జే పాండా మీడియాకు వెల్లడించారు. లోక్‌సభ, రాజసభ పలుమార్లు వాయిదా పడటంతో సభా సమయం వృథా అయిపోయింది. ఇందుకుగానూ తాను కేవలం ఈ సమావేశాల్లో సభ జరిగిన కొద్దిపాటి సమాయినికే వేతనం తీసుకుంటానని, మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయనున్నట్లు చెప్పారు. ఎంపీ పాండా ఒడిషాలోని కేంద్రపారా నుంచి ఎంపీగా గెలుపొందారు. సాధారణంగా ఎంపీలు(లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు) ఎవరైనా పార్లమెంట్ సమావేశాలకు హాజరయితే అందుకుగానూ రోజుకు కొంత మొత్తం నగదు చెల్లిస్తారు. అయితే పార్లమెంట్ సమావేశాలలో ఉభయసభలు ఎక్కువ సమయం వాయిదా పడ్డ విషయం అందరికీ విదితమే. పెద్ద నోట్ల రద్దుపై చర్చించాలని ఎన్డీఏయేతర పక్షాలు పట్టుబట్టడం.. ఎన్డీఏ మిత్ర పక్షాలు చర్చకు రాకపోవడంతో ఉభయ సభలు వాయిదాల పర్వం కొనసాగి లోక్‌సభ 19 గంటలు జరిగి, 92 గంటల సమయం వృథా అయింది. రాజ్యసభ 22 గంటలు కొనసాగి, 86 గంటల సమయాన్ని కోల్పోయాం.