నమ్మించి ముంచడంలో మాస్టర్ డిగ్రీ
రుణ ఉపశమన పత్రాల పేరిట చంద్రబాబు మోసం
2014 ఎన్నికలప్పుడు రుణాలు మాఫీ చేస్తానని హామీ
తీరా గద్దెనెక్కాక కమిటీ పేరుతో కాల యాపన
రైతులు ప్రశ్నించడంతో బాండ్ల జారీ
అవి చెల్లుబాటు కాక నష్టపోయిన 67.42 లక్షల మంది
మళ్లీ ఇప్పుడు మాయ మాటలతో కొత్త మేనిఫెస్టో
‘‘వ్యవసాయం వల్ల ఉపయోగం లేదు.. వ్యవసాయం చేయడం ఇక దండగ.. భూమిని నమ్ముకోకుండా లాభదాయకమైన వ్యాపారాలు చేసుకోవడం ఉత్తమం.. ఉచితంగా విద్యుత్ ఇస్తే.. ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే.. రైతులకు ఎంత చేసినా కావాలంటారు.. వాళ్లకు ఇంకేం పనిలేదు.’’ – అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అన్నమాటలివి.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా మాట్లాడే ఊసరవెల్లి నారా చంద్రబాబు నాయుడు. అ«ధికారమే పరమావధిగా అమలుకు సా«ధ్యం కాని హామీలు గుప్పించడం.. అధికారం రాగానే వాటిని బుట్టదాఖలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 2014లో ఆయన ఇచి్చన హామీలే ఇందుకు నిదర్శనం. ‘బ్యాంకులో తనఖా పెట్టిన మీ భార్య పుస్తెలతాడు ఇంటికి రావాలంటే బాబు రావాలి. మీ రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే బాబు రావాలి’ అంటూ 2014 ఎన్నికల ముందు ఊరూ..వాడా ప్రచారం ఊదరగొట్టారు. తీరా గద్దెనెక్కాక నిండా ముంచిన వైనం ఇప్పటికీ అన్నదాతలు, డ్వాక్రా మహిళల కళ్లెదుట కదలాడుతోంది.
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 2014 ఎన్నికల నాటికి రైతులకు ఉన్న రూ.87,612 కోట్ల వ్యవసాయ, బంగారు రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానంటూ నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక రైతులను నిండా ముంచారు. రుణ మాఫీ సాధ్యం కాదని, ఎగ్గొట్టడంలో భాగంగా ఈ హామీ అమలు సాధ్యాసాధ్యాలపై నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య కమిషన్ వేశారు. ఆ కమిషన్ నివేదిక ప్రకారం కుటుంబానికి రూ.1.50 లక్షలకు మించి మాఫీ చేయబోమని మాట మార్చేశారు.
అంతేకాకుండా అనేక షరతులు పెట్టారు. ఎకరాకు నిర్దేశించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు, సాగు కోసం తీసుకున్న బంగారు రుణాలు, మీడియం టర్మ్ రుణాలుగా మార్చిన పంట రుణాలు అయి ఉండాలంటూ మెలిక పెట్టారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున గరిష్టంగా రూ.50 వేలకే పరిమితం చేశారు. వ్యవసాయ రుణమాఫీ స్కీమ్ (ఏడీఆర్‌ఎస్) కోసం బడ్జెట్ అవసరమని 2014 ఆగస్టు 14న జీఓ 174 జారీ చేశారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు నోడల్ ఏజెన్సీగా రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేశారు.
రూ.50 వేల లోపు ఉన్న రుణాలను వన్‌టైం సెటిల్‌మెంట్ కింద మాఫీ చేస్తామని ప్రకటించారు. ఒక వేళ అర్హత పొంది, అప్పటికే రుణ వాయిదాలు పూర్తిగా చెల్లించి ఉంటే, ఆ మేరకు మొత్తాన్ని వారి సేవింగ్ బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని, ఒక వేళ రుణ బకాయిలు ఉండి ఉంటే వాటికి సర్దుబాటు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇలా గుర్తించిన రైతులకు రైతు సాధికార సంస్థ ద్వారా రైతు ఉపశమన అర్హత పత్రాలు పేరిట హంగామా చేశారు. చివరకు మూడు విడతల్లో కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే విదిల్చారు. 67.42 లక్షల మందికి అర్హత పత్రాలు ఉన్నప్పటికీ ఎగ్గొట్టారు.
అర్హత ఉండి రుణాలు చెల్లించిన వారికి పైసా కూడా చెల్లించిన పాపాన పోలేదు. రైతు రుణ అర్హత పత్రాలు పొందిన వారు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పైసా సాయం అందలేదు. దీంతో చేసిన అప్పులపై వడ్డీలు సైతం చెల్లించలేక లక్షలాది మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు.
అన్నదాత సుఖీభవ అంటూ హంగామా
2019 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప పాదయాత్రలో తాను అధికారంలోకి రాగానే ఏటా రూ.12,500 చొప్పున ప్రతి రైతు కుటుంబానికి నాలుగేళ్లపాటు రూ.50 వేలు ఇస్తానని వైఎస్ జగన్ ఇచ్చిన హామీని కాపీ కొట్టిన చంద్రబాబు ఆ ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల ముందు అన్నదాత సుఖీభవ అంటూ రైతన్నలను బుట్టలో వేసుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. ఈ పథకం కింద కౌలు రైతులతో పాటు 2 హెక్టార్లలోపు చిన్న, సన్నకారు రైతులకు రూ.15 వేలు, 2 హెక్టార్లకు పైబడిన వారికి రూ.10 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ 2019 ఫిబ్రవరి 17న జీవో 28 జారీ చేశారు.
ఆచరణలోకి వచ్చే సరికి పీఎం కిసాన్ సాయంతో ముడిపెట్టి తొలుత 46.76 లక్షల మందికి రూ.1,000 చొప్పున జమ చేశారు. ఎన్నికలకు నెల రోజుల ముందు వివిధ సాకులతో 3.50 లక్షల మందికి కోతపెట్టి 43.26 లక్షల మందికి రూ.3 వేలు చొప్పున వేశారు. ఇలా నాడు అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు మాత్రమే ఇచ్చి రూ.1,765.29 కోట్లతో సరిపుచ్చారు. 2014లో వ్యవసాయ అనుబంధ రంగాల కోసం 200కు పైగా ఇచి్చన హామీలు బుట్టదాఖలయ్యాయి.
ఇప్పుడూ అదే రీతిలో మోసం
2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని మరోసారి రైతులను ఏమార్చేందుకు చంద్రబాబు కొత్త హామీ ఇచ్చాడు. ప్రస్తుతం రైతు భరోసా ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు 53.58 లక్షల మంది ఉన్నారు. వీరిలో కౌలు రైతులు, అటవీ, దేవదాయ సాగుదారులు 2.68 లక్షల మంది ఉన్నారు. ‘బాబు చెప్పినట్టు ఏటా రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఐదేళ్లలో దాదాపు రూ.లక్ష కోట్లు అవసరం. గతంలో రూ.17 వేల కోట్లే సరిగా ఇవ్వలేకపోయిన ఈ పెద్దమనిషి రైతుల కోసం లక్ష కోట్లు ఇస్తానంటే నమ్మేవారెవరూ లేరు’ అని అన్నదాతలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment