వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను కాపీ కొట్టిన చంద్రబాబు
రాష్ట్రంలో ఇప్పటికే రూ.25 లక్షల పరిమితితో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ
ఇప్పటికే 4.7 కోట్ల మందికి పైగా డిజిటల్ హెల్త్ కార్డులు జారీ
ఈ పథకాలను యథాతథంగా మేనిఫెస్టోలో తెచ్చిపెట్టుకున్న టీడీపీ
చంద్రబాబు తీరుపై ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు
సాక్షి, అమరావతి: బూటకపు హామీలు ఇవ్వడం.. వాటిని గాలికొదిలేయడంలో కేరాఫ్ అడ్రస్ ఎవరిదంటే అందరూ చెప్పేమాట చంద్రబాబు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ అలవికాని హామీలను ఇవ్వడం, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపడం, ఆ తర్వాత వాటిని మర్చిపోవడం ఆయనకు వెన్నుపోటుతో పెట్టిన విద్య.
ఈసారి కూడా ఇదే రీతిలో చంద్రబాబు, తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో కొత్తగా ఒక్కటంటే ఒక్క పథకం చంద్రబాబు ఆలోచనల నుంచిలో అమలవుతున్న పథకాలను యథాతథంగా కాపీ కొట్టి మక్కీకి మక్కీ దించేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను నిస్సిగ్గుగా కాపీ కొట్టి తన మేనిఫెస్టోలో పెట్టుకోవడం చంద్రబాబుకే చెల్లిందని రాజకీయ విశ్లేషకులు, ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
కాపీ క్యాట్ బాబు..
రాష్ట్రంలో ప్రజలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వాస్తవానికి ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తోంది. ఈ స్థాయిలో ఉచిత వైద్యాన్ని అందిస్తున్న రాష్ట్రం దేశంలోనే ఏపీ ఒక్కటే కావడం గమనార్హం. చంద్రబాబు పాలనలో కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఆరోగ్యశ్రీ పథకం అందేది.
అలాంటిది అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్ రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటికీ ఈ పథకాన్ని వర్తింపజేశారు. దీంతో రాష్ట్రంలో 90 శాతానికిపైగా కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. వీరందరికీ రూ.25 లక్షల వరకూ వైద్య సేవలు పూర్తిగా ఉచితమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇదే హామీ ఇవ్వడం వల్ల కొత్తగా ప్రజలకు వచ్చే ప్రయోజనమేముందని చర్చ జరుగుతోంది.
డిజిటల్ హెల్త్ కార్డులూ కాపీయేనా బాబు?
ఆరోగ్యశ్రీ పరిమితి పెంపునే కాకుండా మరో దాన్ని కూడా చంద్రబాబు నిస్సిగ్గుగా కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 4.7 కోట్ల మందికిపైగా డిజిటల్ హెల్త్ కార్డులు అందజేసింది. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి కుటుంబానికి స్మార్ట్ హెల్త్ కార్డులు పంపిణీ చేసింది. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే డిజిటల్ వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ అంశంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు చంద్రబాబు సైతం తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇవ్వడం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
బాబు దగా మరువని ప్రజలు
2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో వైద్య ఆరోగ్య విధానం పేరిట చంద్రబాబు మొత్తం 14 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపానపోలేదు. జిల్లాకు ఒక నిమ్స్ ఆస్పత్రి నిర్మాణం అంటూ దాన్ని కూడా గాలికొదిలేశారు. ఆరోగ్యశ్రీలో కొత్త వ్యాధులను చేర్చి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్‌ల సౌకర్యం కలి్పస్తాం అని మేనిఫెస్టోలో ప్రకటించిన బాబు కల్లబొల్లి మాటలతో ప్రజలను వంచించారు.
2007లో వైఎస్సార్ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఎనీ్టఆర్ వైద్యసేవగా దానిపేరు మార్చి కేవలం 117 వ్యాధులను మాత్రమే పెంచింది. అయినా వాటికి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స సరిగా అందని దుస్థితి ఉండేది. ఇలా అనేక బూటకపు హామీలతో 2014లో అధికారంలో వచ్చి చంద్రబాబు చేసిన దగాను ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు.
మందులూ మక్కీకి మక్కీ కాపీ..
తాము అధికారంలోకి వస్తే బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామంటూ చంద్రబాబు మరో హామీ ఇచ్చారు. వాస్తవానికి రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి స్థాయిలో అమలు చేస్తోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా బీపీ, షుగర్, ఇతర జబ్బులున్న వారిని గుర్తించారు.
బాధితులందరికీ సొంత గ్రామాలు, వార్డుల్లోనే ప్రభుత్వ వైద్యులు క్రమం తప్పకుండా ఫాలోఅప్ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక మంచానికి పరిమితం అయిన వారి ఇళ్ల వద్దకే వెళ్లి సేవలు అందజేస్తున్నారు. ఉచితంగా మందులూ అందిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ వైద్యులే ప్రజల ఇంటి ముంగిటకే వెళ్లి సేవలు వైద్య సేవలు అందిస్తుంటే.. తాము అధికారంలోకి వస్తే మందులు ఉచితంగా ఇస్తామంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment