మూడో దశకే అఖిలేష్‌ ఓటమి మ్యానిఫెస్టో! | After 3rd Phase Of Lok Sabha Elections Voting Akhilesh Yadav Released Defeat Manifesto, More Details Inside | Sakshi
Sakshi News home page

Lok Sabha Elections 2024: మూడో దశకే అఖిలేష్‌ ఓటమి మ్యానిఫెస్టో!

Published Thu, May 9 2024 7:20 AM | Last Updated on Thu, May 9 2024 9:26 AM

After 3rd Phase Voting Akhilesh Released Defeat Manifesto

లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసింది. ఇంకా నాలుగు దశల పోలింగ్‌ మిగిలి ఉంది. అయితే ఇంతలోనే సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఓటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే ఇది వారి పార్టీకి సంబంధించినది కాదు.. బీజేపీ ఓటమికి సంబంధించినది.

అఖిలేష్‌ ఈ మేనిఫెస్టోను కాలక్రమం ఆధారంగా వివరిస్తూ ట్వీట్ చేశారు. మీ సొంత రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే అక్కడి మీ సహచరులపై ఎందుకు ఆరోపణలు వచ్చాయని అఖిలేష్‌ బీజేపీ నేతలను ప్రశ్నించారు. బడా పారిశ్రామికవేత్తలు జీఎస్‌టీ, ఆదాయపు పన్ను, ఇతర రకాల పన్నులను ఎగవేసి ఉంటారు. అందుకే నల్లధనం పుట్టుకొచ్చింది. ప్రభుత్వం దీనిని అనుమతించిందో లేక  ఆపలేకపోయిందో గానీ ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పక తప్పదు.

గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాలైన నోట్ల రద్దు, జీఎస్‌టీ తప్పని రుజువైంది. దేశంలో అవినీతి వల్ల తలెత్తుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలకు బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణం. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే బీజేపీ దేశ ప్రతిష్టను దెబ్బతీసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీ నుంచి మన దేశం వైదొలగడానికి కారణం బీజేపీ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం నల్లధనం ఆధారంగా భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా పేర్కొంటున్నదా? అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది.

బీజేపీ ప్రభుత్వం ‘ఎలక్టోరల్ బాండ్’ల విషయంలో ఎందుకు మౌనంగా ఉండిపోయింది? బ్యాంకుల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ పేరుతో పేదల ఖాతాల నుంచి డబ్బులు కొట్టేస్తున్న బీజేపీ ప్రభుత్వం.. దేశ ఆదాయానికి  ఏర్పడిన వేల కోట్ల రూపాయల నష్టాన్ని ఎన్నికల విరాళాలతో  భర్తీ చేస్తుందా? కరోనా వ్యాక్సిన్‌ కోసం విరాళాలు తీసుకుంటున్న బీజేపీ ప్రభుత్వం.. రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం ప్రకటించిన ఎన్నికల విరాళాలను నల్లధనంగా ప్రకటిస్తుందా? అని అఖిలేష్‌ ప్రశ్నించారు.

పార్టీలో  ఎవరిపైన అయినా ఆరోపణలు వస్తే, వారికి గతంలో ఇచ్చిన కాంట్రాక్టులు, లీజులన్నింటినీ బీజేపీ రద్దు చేస్తుందా? ప్రజల సొమ్ముతో రూపొందించిన ‘పీఎం కేర్ ఫండ్’ ఖాతాలను ప్రజల ముందు బహిరంగపరుస్తుందా? బీజేపీ తదుపరి దశ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేక మూడో దశనే చివరి దశగా భావించి ఓటమిని అంగీకరిస్తుందా? అని అఖిలేష్‌ తన ట్వీట్‌లో బీజేపీని ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement