ఎన్నికల పోరులో వేర్వేరు స్థానాల నుంచి గెలిచి లోక్‌సభకు చేరుకునే దంపతులు చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే ఈసారి 18వ లోక్‌సభలో యూపీ నేత అఖిలేష్ యాదవ్, ఆమె భార్య డింపుల్ యాదవ్ పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ నేపధ్యంలో ఈ జంట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ ఒకేసారి లోక్‌సభకు ఎన్నికవడం ఇదే తొలిసారి. అఖిలేష్ తన సంప్రదాయ స్థానమైన కన్నౌజ్ నుంచి ఎంపీగా ఎన్నిక కాగా, అతని భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో వీరిద్దరూ రికార్డు స్థాయి ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎస్పీ నుంచి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఎంపీల్లో డింపుల్ యాదవ్ అగ్రస్థానంలో ఉన్నారు. తరువాతి స్థానంలో ఆమె భర్త అఖిలేష్ యాదవ్ ఉండటం విశేషం.
లోక్‌సభ కార్యకలాపాల సమయంలో ఇద్దరూ సభలో కూర్చున్నప్పుడు పలువురి దృష్టి వీరిపై నిలవనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ అజామ్‌గఢ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదే సమయంలో డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుంచి పోటీ చేసినా, విజయం సాధించలేకపోయారు. అయితే ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి సీటు ఖాళీ అయ్యింది. అప్పుడు అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించి డింపుల్ యాదవ్ లోక్‌సభకు చేరుకున్నారు.
అఖిలేష్ యాదవ్ తొలిసారిగా తన భార్యతో కలిసి లోక్‌సభకు హాజరుకావడమే కాకుండా, ఈసారి ఆయనతో పాటు ఆయన ముగ్గురు సోదరులు కూడా ఎంపీలుగా సభకు రానున్నారు. కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్, మెయిన్‌పురి నుంచి డింపుల్ యాదవ్, అజంగఢ్ నుంచి ధర్మేంద్ర యాదవ్, ఫిరోజాబాద్ నుంచి అక్షయ్ యాదవ్, బదౌన్ నుంచి ఆదిత్య యాదవ్‌లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఈ విధంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఎంపీలుగా లోక్‌సభలోకి అడుగుపెట్టడం మరో రికార్డు కానుంది.
Comments
Please login to add a commentAdd a comment