అటు మాటపై నిలబడని చంద్రబాబు.. ఇటు మాటపై నిలబడే సీఎం జగన్
కూటమిది మాయఫెస్టో..
👉 మాటలతో మభ్యపెట్టి లబ్ధి పొందడమే చంద్రబాబు అజెండా
👉 మేనిఫెస్టో అంటే బాబు దృష్టిలో చిత్తు కాగితం
👉 ఎన్నికలప్పుడు అలవికాని హామీలు..ఆ తర్వాత చెత్తబుట్టలో వేయడం బాబు నైజం
👉 2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీతో జట్టుకట్టి 650 హామీలు ఇచి్చన బాబు
👉 అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను నిలువునా ముంచిన వైనం
👉 రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేయకుండా రైతులకు టోపీ
👉 రూ.25,570.90 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మహిళలకు మోసం
👉 ఇంటికో ఉద్యోగం.. లేదా నెలకురూ.2 వేల నిరుద్యోగ భృతి అంటూ యువతకు వంచన
2014 ఎన్నికల తరహాలోనే మళ్లీ జనసేన, బీజేపీలతో జట్టుకట్టి అలవికాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో కర్ణాటక, తెలంగాణల్లోవిఫలమైన పథకాలకు సూపర్ సిక్స్ ముసుగు
వైఎస్సార్‌సీపీది మేనిఫెస్టో
👉 మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా చూస్తున్న సీఎం జగన్
👉 అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇస్తున్న జననేత
👉 విశ్వసనీయత లేకపోతే రాజకీయాల్లో ఉండకూడదన్నది జగన్ సిద్ధాంతం
👉 ఇచి్చన హామీలన్నీ అమలు చేయడం జగన్ విధానం
👉 2019లో రెండే రెండు పేజీలతో మేనిఫెస్టో విడుదల చేసిన జగన్
👉 అధికారంలోకి వచి్చన తొలి ఏడాదే 95 శాతం.. ఇప్పటికి 99 శాతం హామీలు అమలు
👉 సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ
👉 నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం
👉 ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంతో సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో మరింత పెరిగిన విశ్వసనీయత
👉 2024 ఎన్నికల మేనిఫెస్టోను రెండు పేజీలతో విడుదల చేసిన సీఎం జగన్
👉 జగనన్న అమ్మ ఒడి కింద ఇస్తున్న సొమ్ము రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంపు
👉 వైఎస్సార్ రైతు భరోసా కింద చేస్తున్న సాయం రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు
👉 వృద్ధాప్య పెన్షన్ రూ.3 వేల నుంచి రెండు విడతల్లో రూ.3,500కు పెంచుతానని హామీ
చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం ఇదే తొలిసారి కాదు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, 1995లో అధికారంలోకి వచి్చన బాబు.. 94 ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలోనూ సంపూర్ణ మద్యపాన నిషేధం, రూ.2కే కిలో బియ్యం హామీలను తుంగలో తొక్కారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి, రూ.2 కే కిలో బియ్యాన్ని రూ.5.50కి పెంచి ప్రజలను మోసం చేశారు. 1999 ఎన్నికల్లోనూ అదే కథ. కోటి మందికి ఉపాధి కల్పిస్తానని, 30 లక్షల ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు.
సాక్షి, అమరావతి: మేనిఫెస్టో అంటే ప్రజలకు నాయకుడు ఇచ్చే మాట.. పారీ్టకి, ప్రజలకు మధ్య ఒప్పంద పత్రం.. నాయకుడికి, ప్రజలకు మధ్య బంధం. అందుకే మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా పవిత్రంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చూస్తారు. విశ్వసనీయత లేకపోతే రాజకీయాల్లో ఉండకూడదన్నది ఆయన సిద్ధాంతం. అందుకే అమలు చేయదగిన హామీలతో మేనిఫెస్టోను ప్రకటించారు. 2014, 2019, 2024 వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలే అందుకు నిదర్శనం. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తద్భిన్నం. ఎన్నికలప్పుడు అలవికాని హామీలతో.. అబద్ధాలకు రెక్కలు కడుతూ మేనిఫెస్టోను విడుదల చేయడం, అధికారంలోకి వచ్చాక దానిని తుంగలో తొక్కడం, ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో మేనిఫెస్టోను మాయం చేయడం చంద్రబాబు నైజం. 2014 ఎన్నికల మేనిఫెస్టో అమలే అందుకు తార్కాణం.
విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టుకట్టిన చంద్రబాబు.. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ సహా అలవికాని హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ సమయంలో రూ.లక్ష వరకు రైతు రుణమాఫీ ప్రకటించాలని సీఎం జగన్‌కు సన్నిహితులు సూచించినా.. దాన్ని అమలు చేయలేమని, అలాంటప్పుడు ఆ హామీ ఇవ్వలేనని తేల్చిచెప్పారు. ఆ ఎన్నికల్లో మోదీ ప్రభంజనంలో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో సీఎం జగన్ అధికారంలోకి రాలేకపోయారు. అప్పుడు అధికారంలోకి వచి్చన చంద్రబాబు.. మేనిఫెస్టోను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారు.
వంచించిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన శాస్తి చేశారు. 2019 ఎన్నికల్లో చారిత్రక విజయంతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. తొలి ఏడాదే 95 శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు సరి కొత్త నిర్వచనం చెప్పారు. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ఆరి్థక ఇబ్బందులు ఉత్పన్నమైనా ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు. ఇప్పటికి 99 శాతం హామీలు అమలు చేశారు. అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి వివక్ష చూపకుండా.. లంచాలకు తావు లేకుండా.. పారదర్శకంగా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో లబి్ధదారుల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్‌డీబీటీ కలిపి మొత్తం రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చారు.
2014 ఎన్నికల్లో సీపీఎస్ రద్దు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దాన్ని తుంగలో తొక్కారు. 2019 ఎన్నికల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచి్చన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక దానిపై విస్తృతంగా అధ్యయనం చేసి.. పదవీ విరమణ అయ్యే నాటికి చివరి నెల జీతంలో 50 శాతం పెన్షన్ వచ్చేలా జీపీఎస్‌ను తెచ్చారు. హామీలన్నీ అమలు చేయడంతో సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత మరింతగా పెరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండే రెండు పేజీలతో సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేశారు.
అమ్మ ఒడి పథకం కింద ఏటా ఇస్తున్న రూ.15 వేలను రూ.17 వేలకు పెంచుతానని.. రైతు భరోసా కింద ఏటా ఇస్తున్న రూ.13,500ను రూ.16 వేలకు పెంచుతానని.. వృద్ధాప్య పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రెండు దశల్లో రూ.3,500కు పెంచుతానని కొత్తగా హామీలు ఇచ్చారు. కానీ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 2014 తరహాలోనే మళ్లీ జనసేన, బీజేపీతో జట్టుకట్టి.. తెలంగాణ, కర్ణాటకల్లో విఫలమైన పథకాలకే సూపర్ సిక్స్ ముసుగేసి అలవికాని హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ మేనిఫెస్టో అమలు సాధ్యం కాదని భావించే బీజేపీ దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇచ్చిన మాటపై నిలబడే సీఎం జగన్ ఓ వైపు.. చెప్పిన మాటపై నిలబడిన చరిత్ర ఎన్నడూ లేని చంద్రబాబు మరో వైపు.. ఎవరు కావాలో తేల్చుకోవాల్సింది ప్రజలే.
Comments
Please login to add a commentAdd a comment