మీ మేనిఫెస్టోలో ప్రధాని మోదీ ఫొటో ఎక్కడ చంద్రబాబూ?: సీఎం వైఎస్‌ జగన్‌ | CM YS Jagan Fires On Chandrababu About TDP Manifesto | Sakshi
Sakshi News home page

నాయకుడంటే ఓ నమ్మకం: సీఎం వైఎస్‌ జగన్‌

Published Wed, May 1 2024 4:44 AM | Last Updated on Wed, May 1 2024 8:10 AM

సాయంత్రం 4 గంటలకు  చిత్తూరు జిల్లా కలికిరిలో  జరిగిన సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం , 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలిచ్చిన మోసపూరిత హామీల గురించి వివరిస్తున్న సీఎం జగన్‌

సాయంత్రం 4 గంటలకు చిత్తూరు జిల్లా కలికిరిలో జరిగిన సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం , 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన పారీ్టలిచ్చిన మోసపూరిత హామీల గురించి వివరిస్తున్న సీఎం జగన్‌

టంగుటూరు, మైదుకూరు, కలికిరి ఎన్నికల సభల్లో సీఎం వైఎస్‌ జగన్‌ 

మీ మేనిఫెస్టోలో ప్రధాని మోదీ ఫొటో ఎక్కడ చంద్రబాబూ?  

నిన్నెవ్వరూ నమ్మరు.. నీ హామీలు బూటకమని తేలిపోయింది.. 

నీ విశ్వసనీయత ఎలాంటిదో ఇదే రుజువు 

బాబుది బోగస్‌ రిపోర్ట్‌.. జగన్‌ది ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ 

కూటమి పాతదే.. మోసాలు కొత్తవి 

చంద్రబాబు జీవితమంతా మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లే 

75 ఏళ్లు దాటినా పశ్చాత్తాపం ఏ కోశానా లేదు 

జగన్‌ను ఎందుకు చంపకూడదు? పాతేస్తా..! అని అంటున్నాడు 

58 నెలలుగా మన స్కీమ్‌ల లిస్టు చదువుతుంటే బాబుకు పిచ్చి కోపం వస్తోంది 

ఆయన్ను ప్రశ్నిస్తే ఎల్లో మీడియా, దత్తపుత్రుడు, వదినమ్మ, చంద్రన్న కాంగ్రెస్‌కూ కోపమే 

నాపై తిట్లు, శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు చదువుతున్నారు 

పేదలకు ఏం చేశావని అడుగుతుంటే జవాబు చెప్పకుండా జగన్‌ను తిడతావా బాబూ? 

పెన్షన్లను అడ్డుకున్న బాబును అవ్వాతాతలంతా తిట్టడంతో జగన్‌పై నెపం వేస్తున్నాడు  

ఈ పెద్దమనిషి చంద్రబాబు.. ఇవాళ మేనిఫెస్టో అంటూ ప్రకటించాడు. చంద్రబాబు విశ్వసనీయత, సాధ్యం కాని హామీలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. పైనుంచి బీజేపీ వాళ్లు ఫోన్‌ చేసి నీ ఫొటో మాత్రమే పెట్టుకో! ప్రధాని మోదీ ఫొటోను నీ మేనిఫెస్టోలో పెట్టొద్దు అని తేల్చి చెప్పారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలిచి్చనట్లే కదా! అదంతా మోసమే అని రుజువు అవుతోంది కదా? కూటమిలో ఉంటూ ముగ్గురి ఫొటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు లేడంటే ఒక్కసారి గమనించండి. ప్రజల్ని మోసం చేయడం కోసం ఆయన ఏ స్థాయిలో బరి తెగించాడో చూడండి. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

చేతగానివాడికే కోపం ఎక్కువ..
చంద్రబాబు వయసు 75 ఏళ్లు దాటింది. ఇంత జీవితం.. వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలతోనే గడిచిపోయింది. 75 ఏళ్లు వచ్చాయి కదా..! ఆ మనిషిలో ఇప్పుడైనా పశ్చాత్తాపం కనిపిస్తుందా? అని చూస్తే ఏ కోశానా లేదు. వీళ్లంతా.. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో తెలుసా? జగన్‌ను మనిషి అనాలో రాక్షసుడు అనాలో చంద్రబాబుకు అర్థం కావట్లేదట! జగన్‌ను ఎందుకు చంపకూడదు? అని అడుగుతాడు ఈ పెద్దమనిషి. పనిలో పనిగా జగన్‌ను పాతేస్తానని కూడా అంటాడు. మొన్న నందికొట్కూరు, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు, కోవూరులో అన్న మాటలివి. అయ్యా.. మీ సంస్కారానికి ఓ నమస్కారం! చేతగానివాడికే కోపం ఎక్కువ.
– మైదుకూరు సభలో సీఎం జగన్‌

సాక్షి ప్రతినిధి, ఒంగోలు, సాక్షి ప్రతినిధి, కడప, సాక్షి రాయచోటి: అసత్యాల హరిశ్చంద్రులంతా 2014 తరహాలో మరోసారి కూటమి కట్టి మళ్లీ మోసగించేందుకు తయారయ్యారని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాను వరుసబెట్టి 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్‌ల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబూ..! నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటని అడిగితే సమాదా­నం చెప్పకుండా జగన్‌ను తిడితే ఏం ప్రయో­జనమని ప్రశ్నించారు. 

నాయకుడంటే ప్రజ­లకు నమ్మకం కలిగేలా ఉండాలన్నారు. ‘చంద్ర­బాబుది బోగస్‌ రిపో­ర్టు అయితే మీ జగన్‌ది ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌. ఇద్దరి పాలనలే ఇందుకు నిదర్శనం’ అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం టంగుటూరులో, మధ్యాహ్నం వైఎస్సార్‌ జిల్లా మైదుకూరులో, సాయంత్రం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించిన బహిరంగ సభల్లో సీఎం జగన్‌ మాట్లాడారు. 



నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం..
ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకు­నేవి కాదు. ఇది జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధం కాదు. పేద­లకు–చంద్రబాబు మోసాలకు మధ్య జరుగు­తు­న్న యుద్ధం ఇది. మీరు వేసే ఓటు పేదల తలరాతలను మారుస్తుంది. మీ జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా సజావుగా కొనసాగింపు. పొరపా­టున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లకలకా... అంటూ మళ్లీ ఐదేళ్లు మీ అందరి రక్తం తాగేందుకు తలుపు తడుతుంది. చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే. నాయకుడంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి. తాను ఒక మాట చెబితే చేస్తాడనే నమ్మకం ఆ నాయకుడిపై ప్రజలకు కలగాలి. మేనిఫెస్టోలో చెప్పిన 99శాతం వాగ్దానాలను అమలు చేసి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. 

ఎవరు మనసున్న మనిషి?
చంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్‌ ఎంత? కేవలం రూ.1,000 మాత్రమే. ఈరోజు మీ బిడ్డ ఇస్తున్న పెన్షన్‌ రూ.3,000. మరి ఎవరికి మనసుంది? చంద్ర­బాబు ఏనాడైనా ఆ అవ్వాతాతలకు తోడుగా ఉన్నాడా? ఇంటికే పెన్షన్‌ పంపించాడా? 14 ఏళ్ల పాలనలో ఎన్నడైనా బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మలకు మంచి చేశాడా? మరి మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కి నేరుగా రూ.2.70 లక్షల కోట్లు ఎక్కడా లంచాలు లేకుండా పారదర్శకంగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాడు. 

అందుకనే మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు, మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పిటల్స్‌ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి.  

అక్కచెల్లెమ్మలను ఆదుకున్నాం..
18 శాతం ఓవర్‌ డ్యూస్‌తో ఎన్‌పీఏలుగా సీ, డీ గ్రేడ్‌ల్లోకి పడిపోయిన పొదుపు సంఘాలకు మీ జగన్‌ పునరుజ్జీవం కల్పించాడు. ఈరోజు లోన్‌ రీపేమెంట్‌ ఏకంగా 99.7 శాతానికి చేరుకుని దేశానికే ఆదర్శంగా నిలిచాయి. అక్కచెల్లెమ్మల కోసం ఆసరాతోపాటు సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, పిల్లల చదువులకు తోడుగా విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి అందించి అండగా నిలిచాం. 

మహిళా సాధికారతకు అర్థం చెబుతూ ఏకంగా చట్టం చేసి మరీ నామినేటెడ్‌ పదవుల్లో, కాంట్రాక్టుల్లో అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది మీ బిడ్డ ప్రభుత్వమేనని గర్వంగా చెబుతున్నా. అక్కచెల్లెమ్మలకు రక్షణగా దిశ యాప్, గ్రామంలోనే మహిళా పోలీస్‌ సేవలు అందుబాటులోకి తెచ్చాం. అమ్మ ఒడిని రూ.15వేల నుంచి రూ.17 వేలకు, అవ్వాతాతల పెన్షన్లను రూ.3 వేల నుంచి దశలవారీగా రూ.3,500కి పెంచుకుంటూ వెళతామని మాటిస్తున్నా. 

రైతన్నలకు జగన్‌ ఏం చేశాడంటే..
⇒ ఎన్నడూ లేని విధంగా అన్నదాతలకు రైతు భరోసా ఇచ్చింది మీ బిడ్డ జగన్‌. సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తోంది మీ జగన్‌. 
⇒ గ్రామాల్లో ఆర్బీకేలు తేవడంతోపాటు 9 గంటలు పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఈ– క్రాప్, ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధరలు, ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, రైతన్నలకు సలహాలు, దళారీలు లేకుండా పంటల కొనుగోళ్లు.. ఇవన్నీ జరిగింది ఎప్పుడంటే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాకే.

⇒ మీ జగన్‌ చెప్పిన దాని కంటే మిన్నగా రైతన్నలకు సాయం చేశాడు. రైతు భరోసా ద్వారా ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పినా అంతకంటే మిన్నగా ఐదేళ్లలో రూ.67,500 పెట్టుబడి సాయంగా అందించాడు.  
⇒ ఈ దఫా అధికారంలోకి వచ్చాక ఏటా రూ.16 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.80 వేలు రైతన్నల చేతిలో పెడతామని చెబుతున్నా. మరి మాట తప్పకుండా కచ్చితంగా ఇచ్చే మీ జగన్‌ను నమ్మాలా? లేక ఇస్తానని మోసం చేసే చంద్ర­బాబును నమ్మాలా? 

డెవలప్‌ చేసిందెవరు?
⇒ చంద్రబాబు డెవలప్‌మెంట్‌ కింగ్‌ అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 బాకా ఊదుతుంటాయి. చంద్రబాబు ఏం డెవలప్‌మెంట్‌ చేశాడో మీరే చెప్పండి. గ్రామాల్లో పౌర సేవల్ని పూర్తిగా మారుస్తూ, గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఏకంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు కట్టింది ఎవరు? ఈరోజు 11 వేల విలేజ్, వార్డు క్లినిక్‌లు కనిపిస్తున్నాయంటే వాటిని కట్టింది ఎవరు? మన గ్రామాల్లో 11 వేల రైతు భరోసా కేంద్రాలు కట్టింది ఎవరు? గ్రామానికే ఫైబర్‌ గ్రిడ్, వేగంగా డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం జరుగు­తున్నది కూడా మీ బిడ్డ హయాంలోనే. నాడు–నేడుతో గవర్నమెంట్‌ బడులు, ఆస్పత్రులు బాగు పడ్డాయంటే కారణం ఎవరు?

బాగు చేసింది ఎవరయ్యా?
జగన్‌లా 17 మెడికల్‌ కాలేజీలు తెచ్చావా బాబూ? జగన్‌లా 4 కొత్త సీ పోర్టులు కట్టావా? 10 ఫిషింగ్‌ హార్బర్లు కట్టావా? ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు కట్టావా? మీ జగన్‌ సర్ఫేస్‌ వాటర్‌ (రిజర్వాయర్‌ నుంచి ఉపరితల జలాలు) తరలించి ఉద్దానం వాసుల కిడ్నీ కష్టాలను తీర్చాడు. వెలిగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తెచ్చింది మీ జగన్‌ కాదా? జగన్‌లా ఎయిర్‌పోర్టుల విస్తరణ చేశావా చంద్ర­బాబూ?  భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌­పోర్టు­ను పరుగులు తీయించావా? 3 ఇండస్ట్రియల్‌ కారి­డార్లు, 10 ఇండస్ట్రియల్‌ నోడ్లు.. ఇవన్నీ నువ్వు పరిగెత్తించావా? జగన్‌లా ఎంఎస్‌ఎంఈలకు ఏనాడైనా సపోర్ట్‌ చేశావా? జగన్‌లా స్వయం ఉపాధిని ప్రోత్స­హిస్తూ ఓ రైతు భరోసాగానీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, సున్నా వడ్డీ, వాహన మిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న తోడు, జగనన్న చేదోడు, లా నేస్తం వంటి పథకాలను తెచ్చావా చంద్రబాబూ? అన్నింటికీ మించి పేదరి­కం సంకెళ్లను తెంచేలా పిల్లల చదువులను బాగు చేసింది ఎవరయ్యా చంద్రబాబూ? డెవలప్‌మెంట్‌ విషయంలో కూడా బాబుది బోగస్‌ రిపోర్టే. 

మీ సంస్కారానికి ఓ నమస్కారం..
నేను వరుసబెట్టి 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్‌ల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోంది. మా బాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా? అని ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, టీవీ 5, దత్తపుత్రుడికి కోపం వస్తోంది. వదినమ్మకూ కోపం వస్తోంది. వీరందరికీ పిచ్చి­పిచ్చిగా కోపం వస్తోంది. వీరితోపాటు చంద్రన్న కాంగ్రెస్‌కు కూడా కోపం వస్తోంది. మనకు కౌంటర్‌గా వారు లిస్టులు చదువుతున్నారు. కాకపోతే అవి స్కీమ్‌ల లిస్టులు కాదు. అవన్నీ నాపై తిట్లు, శాప­నా­ర్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు. అవి ప్రతి రోజూ గడగడ చదివేస్తున్నారు. అయ్యా.. మీ అందరి సంస్కారానికి ఓ నమస్కారం.

బంగారం వేలం వేయించిన చంద్రబాబు
చంద్రబాబూ.. రైతుల రుణ మాఫీపై తొలి సంతకం చేస్తానన్నావు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నావు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశావా? బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపించకపోగా ఏకంగా వేలం వేయించాడు. చంద్రబాబు రైతులకు ఉచితంగా పంటల బీమా ఏరోజైనా ఇచ్చాడా? సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌  సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఉందా? సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చాడా? లేక ఎగరగొట్టారా? పెట్టుబడి సాయంగా చంద్రబాబు ఏ ఒక్క రైతుకైనా రైతు భరోసా అందించారా? ఎన్నికలు రావడంతో జగన్‌ కంటే ఎక్కువ డబ్బులిస్తానంటూ నమ్మబలుకుతున్నాడు. 

రైతులపై కాల్పులు జరిపించిన బాబు
వ్యవసాయం దండగ అని నువ్వు మాట్లాడిన మాట నిజం కాదా చంద్రబాబూ? రైతులపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపించింది నువ్వు కాదా? రైతులను విచారించేందుకు ఏకంగా ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు తెచ్చింది నువ్వు కాదా? రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందన్న మాటలు నీవి కావా? రైతులను అన్ని రకాలుగా మోసం చేసి నిట్ట నిలువునా ముంచిన నీది బోగస్‌ రిపోర్టు కాదా?

పెన్షన్లపై బాబు కుట్రలు
ఈ బోగస్‌ బాబు చేస్తున్న మరో దుర్మార్గం చూడండి. పెన్షన్ల విషయంలో బాబు కుట్రలను గమనించండి. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ ఒక్కరోజైనా అవ్వాతాతల బాధలను పట్టించుకున్నాడా? పెన్షన్లు ఇంటికే పంపించిన చరిత్ర చంద్రబాబు హయాంలో ఉందా? మీ జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే ఆందోళనతో తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్లను ఆపించారు. వలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కాదా? తాను చేసిన వెధవ పనికి ఆ అవ్వా తాతలంతా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుండటంతో ఆ నెపాన్ని జగన్‌ మీదకు తోస్తున్నాడు. ఇంతకంటే దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో ఉంటుందా?

నీ కళ్లకు పచ్చ కామెర్లా?
బడులకు పంపే తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి అనే పథకాన్ని నీ హయాంలో ఏ రోజైనా తెచ్చావా బాబూ? పేదింటి పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం, బైలింగ్వల్‌ టెక్ట్స్‌ బుక్స్, 8వ తరగతికి వచ్చే సరికి ట్యాబ్‌లు, 6వ తరగతి నుంచే ఐఎఫ్‌పీలతో డిజిటల్‌ బోధన, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్, బైజూస్‌ కంటెంట్‌ లాంటివి కనిపించడం లేదా చంద్రబాబూ? పచ్చకామెర్లు వచ్చాయా నీ కళ్లకు?  పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెన, ఖర్చులకు ఇబ్బంది పడకుండా వసతి దీవెన, తొలిసారిగా ఆన్‌లైన్‌ సర్టిఫైడ్‌ వర్టికల్స్‌.. ఇవన్నీ వచ్చింది ఈ 58 నెలల కాలంలోనే కాదా? మరి చదువుల విషయంలో చంద్రబాబు రిపోర్టు బోగస్‌ కాదా?

బాబుది బోగస్‌ రిపోర్ట్‌.. జగన్‌ది ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ 
బాబు వస్తే జాబొస్తుందని 2014లో చంద్రబాబు, ఎల్లో మీడియా ఊదరగొట్టాయి. చంద్రబాబు ఐదేళ్లలో ముష్టి వేసినట్లు 32 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే మీ జగన్‌ 2.31 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాడు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో గవర్నమెంట్‌ ఉద్యోగాలు నాలుగు లక్షలు మాత్రమే ఉంటే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఏకంగా మరో 2.31 లక్షల గవర్నమెంట్‌ ఉద్యోగాలు భర్తీ చేశాడు. మన చెల్లెమ్మలు, తమ్ముళ్లే గ్రామ సచివాలయాలు, మెరుగుపడిన ఆస్పత్రులు, బాగుపడిన స్కూళ్లలో కనిపిస్తున్నారు. మరి బాబు రిపోర్ట్‌ బోగస్‌ కాదా? ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ జగన్‌ రిపోర్టు కళ్లెదుటే కనిపిస్తున్న వాస్తవం కాదా?

మన అభ్యర్థులను ఆశీర్వదించండి
ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కొండపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సురేష్, ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్‌. రఘురామిరెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలి.

రాజోలి మనమే పూర్తి చేస్తాం..
మన ప్రభుత్వం మళ్లీ రాగానే రాజోలి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. కరోనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా అనుకున్న సమయానికి చేయలేకపోయాం. నాలుగేళ్లు పుష్కలంగా వర్షాలు పడటంతో అన్ని ప్రాజెక్టులు నిండాయి. ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగా పడటంతో రాజోలి ప్రాముఖ్యత తెలుస్తోంది. వచ్చే టర్మ్‌లో కచ్చితంగా రాజోలి ప్రాజెక్టును పూర్తి చేస్తాం.

2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..
⇒ రూ.87,612 కోట్ల రైతు రుణాలు మాఫీ చేశాడా? రూ.14,205 కోట్లు డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాల్లో కనీసం ఒక్క రూపాయి మాఫీ చేశాడా? 
⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకుల్లో వేస్తామని నమ్మబలికిన చంద్రబాబు ఏ ఒక్కరి ఖాతాలోనైనా రూపాయి జమ చేశాడా?
⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల నిరుద్యోగ భృతి అని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ ప్రకారం ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఎవరికైనా ఇచ్చాడా?
⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు ఒక్కరికైనా ఇచ్చాడా? 
⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాల మాఫీ జరిగిందా? 
⇒ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాడా? 
⇒ సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ అన్నాడు. కొండపి, మైదుకూరులో ఎక్కడైనా కనిపిస్తున్నాయా? 
⇒ పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా? అది కూడా అమ్మేశాడు. 
⇒ అవే మూడు పార్టీలు ఇప్పుడు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు అంటూ మరోసారి మోసాలకు సిద్ధమయ్యాయి.

జవాబు చెప్పకుండా జగన్‌ను తిడతావా?
చంద్రబాబూ నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటని అడిగితే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను అమలు చేశావా? అంటే సమాధానం రాదు. మీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి? ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్‌ను తిడితే ఏం ప్రయోజనం? ఇంటింటికీ ఎవరు మంచి చేశారు? ఎవరు అందరినీ మోసగించారు? వారి చరిత్ర ఏమిటనేది ప్రజలందరికీ తెలుసు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement