Prakash Raj Reacts On Actor Sudeep Support To BJP In Karnataka Polls - Sakshi
Sakshi News home page

దిగ్భ్రాంతికి లోనయ్యా... చాలా బాధగా ఉంది: ప్రకాష్‌ రాజ్‌

Published Thu, Apr 6 2023 10:10 AM | Last Updated on Thu, Apr 20 2023 5:25 PM

Prakash Raj Reacts On Actor Sudeep Support BJP In Karnataka Polls - Sakshi

బెంగళూరు: సినీ నటుడు, రాజకీయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రకాష్‌ రాజ్‌.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తోటి నటుడు, కన్నడ స్టార్‌గా పేరున్న సుదీప్‌ బీజేపీకి మద్దతు ప్రకటించడంపై ప్రకాష్‌ రాజ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

కిచ్చా సుదీప్‌ ప్రకటనతో దిగ్భ్రాంతికి గురయ్యా. ఎంతో బాధించింది అని ఓ జాతీయ మీడియాతో పేర్కొన్నారాయన. అంతకు ముందు కిచ్చా సుదీప్‌ బీజేపీలో చేరతారంటూ వచ్చిన కథనాలను ప్రకాష్‌ రాజ్‌ ఖండించారు. 

అది తప్పుడు వార్త అయ్యి ఉంటుందని బలంగా నమ్ముతున్నా. బీజేపీ ఓటమి భయంతోనే అలాంటి ప్రచారానికి దిగింది. అలాంటి ఉచ్చులో పడడానికి సుదీప్‌ అమాయకుడేం కాదంటూ ప్రకాష్‌ రాజ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.  కానీ, ఆ అంచనాని తలకిందులు చేస్తూ బుధవారం బీజేపీకి మద్దతు ప్రకటించారు సుదీప్‌.

తాను రాజకీయాల్లో చేరబోనంటూనే.. రాబోయే ఎన్నికల్లో కేవలం బీజేపీ తరపున ప్రచారం చేస్తానని సుదీప్‌ చెప్పారు. సీఎం బసవరాజ్‌ బొమ్మై తనకు గాడ్‌ఫాదర్‌ లాంటి వాడని, ఆయన ఏ పార్టీలో ఉన్నా తాను ప్రచారం చేసేవాడినంటూ సుదీప్‌ నిన్న ఓ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement