బెంగళూరు: కర్ణాటకలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని రాష్ట్రంలో ఆ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక పీసీసీ సారథి డీకే శివకుమార్ బల్లగుద్ది చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన పలు విషయాలు చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే..
► నా 35 ఏళ్ల రాజకీయ అనుభవం, సర్వే ఫలితాలను అనుసరించి చెప్తున్నా.. కన్నడ నాట ఈసారి 141 శాసనసభ స్థానాల్లో విజయఢంకా మోగిస్తాం
► దక్షిణభారతంలో మోదీమేనియా పనిచేయదు. ఇక్కడ స్థానిక, అభివృద్ధి అంశాలే ఎన్నికల్లో కీలకంగా నిలుస్తాయి
► ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల విజయానికి సింహద్వారంగా నిలుస్తుంది
► గెలిచాక పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యేది సిద్దరామయ్యనా లేక నేనా అనేది అనవసర చర్చ. ఇక్కడ బీజేపీని ఓడించడమే అసలైన లక్ష్యం.
► రాష్ట్రం జ్ఞాన రాజధాని. బీజేపీవారు హిజాబ్, హలాల్ వంటి నాటకాలు ఆడుతున్నారు. కర్ణాటక ప్రజల్లో ఎంతో పరిణతి ఉంది. రాష్ట్రాభివృద్ధికి ఇలాంటివి కొత్త సమస్యలు తెస్తాయని జనం భయపడుతున్నారు
► బీజేపీ అగ్రనేతల మేజిక్ ఇక్కడ పనిచేయదు. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌లలో మోదీ ఛరిష్మా పనిచేసిందా? ప్రజల కడుపు నింపితేనే, చక్కని పాలన అందిస్తేనే మీ గురించి జనం ఆలోచిస్తారు. ఈసారి ఇక్కడా జరిగేది అదే.
Karnataka assembly election 2023: ‘సార్వత్రిక’ విజయానికి ఈ ఎన్నికలే సింహద్వారం
Published Sun, Apr 30 2023 5:32 AM | Last Updated on Sun, Apr 30 2023 5:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment