
కృష్ణరాజపురం: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను ఎంపిక చేయాలని ఒక్కలిగ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని కేఆర్‌పురం ఉత్తర విభాగం తాలూకాలో జరిగిన కార్యక్రమంలో జై భువనేశ్వరి ఒక్కలిగ సంఘం సభ్యులు మాట్లాడుతూ... శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడానికి సిద్దరామయ్యతో పాటు డీకే శివకుమార్ కూడా కృషి చేశారని, కేపీసీసీ చీఫ్‌గా కూడా ఆయన పార్టీ గెలుపునకు విశేష కృషి చేశారని, శివకుమార్‌ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేశారు.
ఓటమిపై జేడీఎస్ సమాలోచన
యశవంతపుర: రాష్ట్ర విధానసభ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన జేడీఎస్ ఓటమికి గల కారణాలపై సమీక్షిస్తోంది. ఓడిన అభ్యర్థులతో పార్టీ సీనియర్ నాయకులు చర్చించి ధైర్యం నింపారు. మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ ఫోన్ ద్వారా చర్చించారు. మాజీ సీఎం కుమారస్వామి గెలిచిన, ఓడిన అభ్యర్థులతో చర్చించి విశ్వాసం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఓడిన అభ్యర్థులకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment