
యశవంతపుర: తల్లీ మృతితో దుఖఃలో ఉన్న కానిస్టేబుల్ విధులకు హాజరై సీనియర్ పోలీసు అధికారుల నుంచి మన్ననలు అందుకున్నారు. అశోక్ అనే వ్యక్తి గదగ్‌లోని టగేరి లేఔట్ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్. ఈయన తల్లి శంకరమ్మ గదగ(78) వృద్ధాప్యంతో ఆదివారం రాత్రి మృతి చెందారు.
సోమవారం సాయంత్రం అంత్యక్రియలే పూర్తి చేశారు. ఓ వైపు బాధలో ఉన్నా అశోక్ మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యాడు. సెలవు ఇచ్చినా విధులకు హాజరై వృత్తిపై నిబద్ధతత చాటిన అశోక్‌ను అధికారులు మెచ్చుకున్నారు.