
మైసూరు: కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికను ప్రజలు ఆమోదించినట్లు పోలింగ్ సరళినిబట్టి తెలుస్తోందని, 130 నుంచి 150 స్థానాల్లో విజయం సాధిస్తామని మాజీ సీఎం సిద్దరామయ్య తెలిపారు. మైసూరులో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కరావళిలో మెజార్టీ స్థానాలు హస్తగతం అవుతాయన్నారు. ప్రజల నాడి తమకు అర్థమైందని, తమ పార్టీ ప్రణాళికను ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. బీజేపీ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మలేదన్నారు. తాము అనుకున్నది జరిగి తీరుతుందన్నారు. వరుణలో తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు.