
కర్ణాటక: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసంతృప్తుల బెడద పెరిగిందని యలబుర్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి వాపోయారు. ఆయన బుధవారం కొప్పళ జిల్లా కుకనూరు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తనకంటే తర్వాత ఎమ్మెల్యే అయినవారు ముఖ్యమంత్రులయ్యారన్నారు.
అందుకు నియోజకవర్గం ప్రజలు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. మన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను చూడండి, కాంగ్రెస్‌లోకి వచ్చి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. కాంగ్రెస్‌లో తన వెనుక నడిచిన వాళ్లంతా మంత్రులయ్యారని అసంతృప్తి వెలిబుచ్చారు. సిద్దరామయ్య సంక్షేమ బడ్జెట్‌ను ప్రకటించారన్నారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన రాయరెడ్డికి ఈ దఫా మంత్రి పదవి దక్కకపోవడంతో అసహనానికి లోనయ్యారు.